ANNAMAIAH DEATH ANNIVERSARY FETE CONCLUDES _ ముగిసిన అన్న‌మ‌య్య వ‌ర్ధంతి ఉత్స‌వాలు

Tirupati, 11 Apr. 21: The 518th Death Anniversary of Saint Poet Sri Tallapaka Annamacharya concluded on Sunday. 

TTD mulled series of religious programmes at Tirupati, Tirumala and Tallapaka from April 7 to 11 under the aegis of the Annamacharya Project in a big way. 

The literary, devotional musical programmes mused the denizens and devotees of respective places. 

Annamacharya Project Director Sri Dakshinamurthy Sharma supervised the arrangements at all places. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముగిసిన అన్న‌మ‌య్య వ‌ర్ధంతి ఉత్స‌వాలు

తిరుప‌తి, 2021 ఏప్రిల్ 11: శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతి మహోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఏప్రిల్ 7 నుండి 11వ తేదీ వ‌ర‌కు తిరుప‌తి, తాళ్ల‌పాక‌లో ఈ ఉత్స‌వాలు జ‌రిగాయి. చివ‌రి రోజు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జ‌రిగిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.

ఉదయం 9 నుండి 10 గంటల వరకు కళాకారులు సామూహిక సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన శ్రీమతి మాళ‌విక‌ బృందం గాత్ర సంగీతం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తిరుపతికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత కళాకారిణి శ్రీమతి జంధ్యాల కృష్ణ కుమారి హరికథ పారాయణం చేశారు.

కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ బి.ర‌ఘునాథ్‌ బృందం గాత్రం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయ‌కులు శ్రీ జి.నాగేశ్వ‌ర‌నాయుడు బృందం గాత్ర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మ‌హ‌తిలో…

తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ గుర‌జాడ మ‌ధుసూద‌న‌రావు బృందం గాత్రం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు ధ‌ర్మ‌వ‌రానికి చెందిన శ్రీ డి.ఆర్‌.బాబూ బాలాజి బృందం నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య సింగ‌రాజు ద‌క్షిణా‌మూర్తి శ‌ర్మ, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి నాగ‌మ‌ణి, సీనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ న‌ర‌సింహులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.