ANNAMAIAH SANKEERTANS ENTHRALL DEVOTEES AT NADA NIRANJANAM _ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆక‌ట్టుకున్న అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

Tirumala, 15 October 2023: Devotees were enthralled by Annamacharya Sankeertans rendered in a melodious manner at the Nada Niranjanam platform as part of the ongoing Navaratri brahmotsavams.

Smt Sada Bargavi, TTD JEO for Health and Education who graced the inaugural session of the devotional cultural program on Sunday evening said the uniqueness of the program is that these Annamacharya Sankeertans are brand new which are brought to light recently and are tuned by prominent vocalists of Chennai and Hyderabad who will be presenting them to the public for the first time through this platform.

Dr Akella Vibhishana Sharma, Special Officer of SV Recording Project was present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆక‌ట్టుకున్న అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

 తిరుమల, 2023 అక్టోబరు 15 ; తిరుమ‌ల శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌ముఖ క‌ళాకారులు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ఆల‌పించారు.

ఈ సంద‌ర్భంగా జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి మాట్లాడుతూ, కొత్త‌గా వెలుగులోకి తీసుకువ‌చ్చిన అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లను స్వ‌ర‌ప‌రిచి తొలిసారిగా భ‌క్త కోటికి ప్ర‌ముఖ‌ సంగీత ద‌ర్శ‌కులు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో అందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి రోజు సాయంత్రం నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఈ సంగీత ప్ర‌ముఖులు వారు స్వ‌ర ప‌రిచిన సంకీర్త‌న‌లను వారే ఆల‌పిస్తున్న‌ట్లు వివ‌రించారు.

అనంత‌రం చెన్నైకి చెందిన శ్రీ‌మ‌తి గాయ‌త్రి నారాయ‌ణ, హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ ఫ‌ణి నారాయ‌ణ, నేమ‌ని పార్థ‌సార‌థి సుమ‌ధురంగా కీర్త‌న‌లను ఆల‌పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్ర‌త్యేకాధికారి డాక్టర్ విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.