ANNUAL BRAHMOTSAVAMS AT SRI KALIGIRI VENKATESWARA SWAMY TEMPLE FROM SEP 24 TO OCT 2 _ సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు శ్రీ కలిగిరి వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati/Kaligiri, 19 September 2025: The annual Brahmotsavams of Sri Kaligiri Venkateswara Swamy Temple in Chittoor District will be observed with grandeur from September 24 to October 02.
The festivities will begin on September 23 with Ankurarpanam and Senadhipati Utsavam from 6PM to 8PM. On September 24 (Wednesday), Dwajarohanam will be performed in Vrischika Lagnam between 10:15 AM and 11:15 AM, formally commencing the Brahmotsavams.
During the festival, Vahana Sevas will be conducted daily in the morning from 8AM to 9AM and in the evening from 7PM to 8PM.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి / కలిగిరికొండ, 2025, సెప్టెంబర్ 19.: చిత్తూరు జిల్లా శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 23న సాయంత్రం 06.00 గం.ల నుండి 08.00 గం.ల వరకు అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ బుధవారం ఉదయం 10.15 గం.ల నుండి 11.15 గం.ల వరకు వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఉదయం 08.00 గం.ల నుండి 09.00 వరకు, రాత్రి 07.00 గం.ల నుండి 08.00 గం.ల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
24.09.2025 ———- శేష వాహనం
25.09.2025 తిరుచ్చి ఉత్సవం హంస వాహనం
26.09.205 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
27.09.2025 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
28.09.205 మోహినీ ఉత్సవం గరుడ వాహనం
29.09.2025. హనుమంత వాహనం గజ వాహనం
30.09.2025. సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
01.10. 2025 రథోత్సవం అశ్వవాహనం
2. 10. 2025. చక్రస్నానం ధ్వజావరోహణం
సెప్టంబర్ 27వ తేదీ ఉదయం 11.00 గం.ల నుండి 01.00 గం.ల వరకు కల్యాణోత్సవం జరుగనుంది.
ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
