ANNUAL BRAHMOTSAVAMS OF SRI KALYANA VENKATESWARA SWAMY CONCLUDE WITH DWAJAVAROHANAM _ ధ్వజావరోహణంతో వైభవంగా ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
Tirupati, June 05, 2026: The nine-day annual Brahmotsavams of Sri Padmavati Sameta Sri Kalyana Venkateswara Swamy at Narayanavanam concluded grandly on Friday evening with the ceremonial Dwajavarohanam.
As part of the ritual, the Garuda flag was lowered, symbolically bidding farewell to the deities invited during Dwajarohanam at the commencement of the festival.
The Brahmotsavams, marked by various Vahana Sevas and spiritual festivities, came to a successful conclusion amidst Vedic chants and devotional fervour.
Temple Superintendent Sri Srinivasulu Reddy, Temple Inspector Sri Nagaraju, priests and officials participated in the event.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ధ్వజావరోహణంతో వైభవంగా ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
దేవతలకు వీడ్కోలు పలికిన ధ్వజావరోహణ మహోత్సవం
తిరుపతి, 2026 జూన్ 05: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం జరిగిన ధ్వజావరోహణ మహోత్సవంతో శాస్త్రోక్తంగా ముగిశాయి.
బ్రహ్మోత్సవాల ఆరంభంలో ధ్వజారోహణం ద్వారా ఆహ్వానించిన సకల దేవతలను, గరుడ పటాన్ని అవనతం చేసి సంప్రదాయబద్ధంగా సాగనంపారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన ఈ పుణ్యకార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది.
తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలు, ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులకు దివ్యానుభూతిని ప్రసాదించిన స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో పూర్ణాహుతి పొందాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు మరియు అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
