ANNUAL BRAHMOTSAVAMS OF SRI VENKATESWARA SWAMY AT JUBILEE HILLS FROM FEBRUARY 17 TO 25 _ ఫిబ్రవరి 17 నుండి 25వ తేదీ వరకు జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati / Hyderabad 29 January 2026: The Annual Brahmotsavams of Sri Venkateswara Swamy Temple, located near Jubilee Hills, Hyderabad, Telangana State, will be conducted from February 17 to February 25, 2026. 

The festivities will commence with Ankurarpana on the evening of February 16, 2026.

Koil Alwar Thirumanjanam on February 10.  

As part of the traditional rituals, the Lord will be awakened during the early morning hours, followed by Agama-prescribed religious ceremonies. Koil Alwar Thirumanjanam will be performed from 7:00 AM to 10:30 AM, during which the temple premises, including walls, ceilings, and all ritual articles, will be purified with water. This will be followed by sprinkling sacred water mixed with aromatic substances throughout the temple.

Devotees will be permitted for Sarva Darshan from 11:00 AM to 5:00 PM on the same day.

Vahanam Sevas Timing

Vahanam Sevas will be conducted daily from 8:00 AM to 9:00 AM and 7:00 PM to 8:00 PM, unless otherwise specified.

Schedule of Vahanam Sevas during Brahmotsavams

February 17, 2026

Morning: Dwajarohanam (Aries Lagna – 10:30 AM to 11:00 AM)

Night: Pedda Sesha Vahanam

February 18, 2026

Morning: Chinna Sesha Vahanam

Night: Hamsa Vahanam

February 19, 2026

Morning: Simha Vahanam

Night: Muthyapu Pandiri Vahanam

February 20, 2026

Morning: Kalpavriksha Vahanam

Night: Sarvabhoopala Vahanam

February 21, 2026

Morning: Pallaki Utsavam (Mohini Avatar)

Night: Garuda Vahanam (7:00 PM to 9:00 PM)

February 22, 2026

Morning: Hanumantha Vahanam

Night: Gaja Vahanam

February 23, 2026

Morning: Suryaprabha Vahanam

Night: Chandraprabha Vahanam

February 24, 2026

Morning: Rathotsavam

Night: Ashwa Vahanam

February 25, 2026

Morning: Chakrasnanam (8:00 AM to 10:00 AM)

Night: Dwajavarohanam (6:00 PM to 8:00 PM)

February 26, 2026

3:00 PM: Pushpayagam

During the Brahmotsavams, under the auspices of the TTD Hindu Dharma Prachara Parishad, Kolata dances and Bhajan programmes will be organized daily prior to the Vahanam Sevas. Artists from the Annamacharya Project will render Annamacharya Sankeertanas.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 17 నుండి 25 తేదీ వరకు జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2026, జనవరి 29: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి 25 తేదీ వరకు జరగనున్నాయిఫిబ్రవరి 16 తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.

ఫిబ్రవరి 10 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

 సందర్భంగా తెల్లవారుజామున వేకువ జూమున స్వామివారిని మేల్కొలిపిఅనంతరం ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడుతారు.  ఉదయం 07.00 గం. నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతారుఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారుఅనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఉదయం 11 గం. నుండి సాయంత్రం 05.00 గం. వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కురాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

17-02-2026

ఉదయం – ధ్వజారోహణం ( మేష లగ్నం –  . 10.30 – 11.00 గంటల వరకు)

రాత్రి – పెద్దశేష వాహనం

18-02-2026

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

19-02-2026

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

20-02-2026

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

21-02-2026

ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం (రాత్రి 07.00 గం. నుండి 09.00 గం. వరకు)

22-02-2026

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి – గజ వాహనం

23-02-2026

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

24-02-2026

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

25-02-2026

ఉదయం – చక్రస్నానం(. 08.00 నుండి 10.00 గంటల వరకు)

రాత్రి – ధ్వజావరోహణంసా. 6 నుండి రాత్రి 8 గంటల వరకు)

26.02.2026.

మధ్యాహ్నం 03.00 గం.లకు పుష్పయాగం .

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలుభజన కార్యక్రమాలను నిర్వహించనున్నారుఅన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.