ANNUAL BRAHMOTSAVAMS OF SRI VENUGOPALA SWAMY TEMPLE AT KAARVETINAGARAM FROM JUNE 6 TO 14 _ జూన్ 05న అంకురార్పణతో కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభం

ANKURARPANAM ON JUNE 5

GARUDA SEVA ON JUNE 10

RATHOTSAVAM ON JUNE 13

Tirupati, May 18, 2026: The annual Brahmotsavams of Sri Venugopalaswamy along with Sri Rukmini and Satyabhama at Karvetinagaram, will be held from June 6 to 14 in a grand manner. The festivities will commence with Ankurarpanam on the evening of June 5.

Koil Alwar Tirumanjanam will be observed at the temple on June 2 from 7.30 am to 11.30 am.

Various Vahana Sevas will be conducted every day during the Brahmotsavams. Garuda Seva will be held on June 10 and Rathotsavam on June 13.

Sri Swamivari Kalyanotsavam will be performed on June 9. Devotees can participate by paying Rs.300 per couple.

Pushpayagam will be conducted on June 15 from 1.30 pm to 4 pm.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

జూన్ 05న అంకురార్పణతో కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభం

జూన్ 6 నుండి 14 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

జూన్ 10న గరుడసేవ – జూన్ 13న రథోత్సవం

తిరుపతి, 2026 మే 18: కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జూన్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

జూన్ 02 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ఈ పవిత్ర ఉత్సవాలకు ముందుగా జూన్ 2వ తేదీ ఉదయం 7:30 నుండి 11:30 గంటల వరకు స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేయనున్నారు.

నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.

వాహన సేవల వివరాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 7:30 నుండి 9:30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

జూన్ 6 – ధ్వజారోహణం (ఉదయం 8:10 నుండి 8:45 వరకు కర్కాటక లగ్నం), రాత్రి పెద్దశేష వాహనం

జూన్ 7 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం

జూన్ 8 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం

జూన్ 9 – ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి సర్వభూపాల వాహనం

జూన్ 10 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి మహాగరుడ వాహనం

జూన్ 11 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం

జూన్ 12 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం

జూన్ 13 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం

జూన్ 14 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం

జూన్ 09న శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం

బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన జూన్ 9న స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రూ.300/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం ప్రసాదంగా అందజేయనున్నారు.

జూన్ 15 పుష్పయాగం

అలాగే జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 1:30 నుండి 4 గంటల వరకు పుష్పయాగం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.