Annual Bramhotsavam in Sri Kodanda Rama Swamy Temple Begins _ ధ్వజారోహణంతో  వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirupati, March 11, 2013: `Dwajarohanam‘ was performed in the temple, signalling the commencement of the nine-day annual `Brahmotsavam’ in Sri Kodanda Ramaswamy Temple in Tirupati on Monday morning. The sacred yellow cloth flag with the imprint of Lord Garuda, the celestial carrier of Lord Maha Vishnu, was hoisted atop the golden flag post ‘Dwajasthambham’ situated inside the temple complex at the auspicious Vrushabha lagnam at 10.30am amidst the traditional recitation of Vedic hymns by temple priests.

Prior to the divine ceremony, the processional deities of Sri Kodanda Ramaswamy, Seetha Devi and Lakshmana along with the Dwajapatam were taken around the mada streets encircling the shrine in a grand procession. It is believed Lord Garuda goes round the temple complex extending invitations to all gods, heavenly bodies, rishis and the entire devatha community to participate in the Brahmotsavam of Lord. 

DyEO(Local Temples) Sri Chandrasekhar Pillai, RDO Sri Ramachandra Reddy, DPP Spl Officer Sri Raghunath, Suptd Engineer Sri Sudhakar Rao, Executive Engineer, Sri Jagadeeswara Reddy, Garden Supdt Sri Srinivas, Temple Supdt Sri Munisuresh Reddy, Temple Inspector Sri Anjaneyulu, Staff and devotees took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ధ్వజారోహణంతో  వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, మార్చి 11, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం ధ్వజారోహ ణంతో వైభవంగా వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10.10 గంటలకు వృషభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు.

ఈ సందర్భంగా తితిదే వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ప్రసంగిస్తూ ధ్వజారోహణంతో సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్టు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు జరుగనున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మార్చి 15న గరుడసేవ, మార్చి 18న రథోత్సవం, మార్చి 19వ తేదీన చక్రస్నానం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఆలయంలో అద్భుతంగా విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టారు. తితిదే ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో రామాయణంలోని ఘట్టాలతో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ బోర్డులు ఆకట్టుకుంటున్నాయి. తితిదే గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హనుమంతుడు లంకిణి రాక్షసిని సంహరించడం, సీతను అడవిలో వదిలేందుకు లక్ష్మణుడు రథంలో తీసుకెళ్లే సెట్‌లు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

ముందుగా ఉదయం 8.30 నుండి 10.00 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులు, ధ్వజపటము, చక్రత్తాళ్వారుతో సహా తిరువీధుల ఉత్సవం నిర్వహించారు. ఉదయం 11.30 గంటల నుండి 12.30 గంటల వరకు స్నపన తిరుమంజనం జరిగింది. రాత్రి 8.30 గంటల నుండి 10.00 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేయనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌ ”శ్రీరామాయణ వైభవము” అనే అంశంపై ఉపన్యసించనున్నారు. అలాగే శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత కచేరి నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, సంక్షేమ విభాగం ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ భాస్కర్‌రెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ రఘునాధ్‌, ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు, ఏఈఓ శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.