ANNUAL BTU AT KOSUVARIPALLI FROM JAN 26 TO FEB 3 _ జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కోసువారిపల్లి శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 12 Jan. 20: The annual Brahmotsavams at TTD sub temple of Sri Prasanna Venkateswara Swamy at Kosuvaripalli in Tamballapalli mandal of Chittoor district will be 6observed from January 26 to February 3.

The important days includes Dhwajarohanam on January 26, Garuda Seva and Kalyanotsavam on January 31, Chakrasnanam on February 3 and Pushpayagam on January 4.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కోసువారిపల్లి శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుప‌తి, 2020 జనవరి 12: టిటిడికి అనుబంధంగా ఉన్న తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జనవరి 25వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :     

తేదీ                                         ఉదయం                                             రాత్రి

26-01-2020(ఆదివారం) ధ్వజారోహణం                                 పల్లకీ ఉత్సవం

27-01-2020(సోమ‌వారం) పెద్దశేషవాహనం                           హంసవాహనం

28-01-2020(మంగ‌ళ‌వారం) ముత్యపుపందిరి వాహనం          సింహవాహనం

29-01-2020(బుధ‌వారం) కల్పవృక్ష వాహనం                          హనుమంత వాహనం

30-01-2020(గురువారం) సూర్యప్రభ వాహనం                          చంద్రప్రభ వాహనం

31-01-2020(శుక్ర‌వారం) సర్వభూపాల వాహనం కల్యాణోత్సవం, గరుడవాహనం

01-02-2020(శ‌నివారం) రథోత్సవం                                               గజ వాహనం

02-02-2020(ఆదివారం) పల్లకీ ఉత్సవం                                      అశ్వ వాహనం

03-02-2020(సోమ‌వారం) చక్రస్నానం,                                           ధ్వజావరోహణం

కాగా జ‌న‌వ‌రి 31వ తేదీ శుక్ర‌వారం ఆలయంలో కల్యాణోత్సవం రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 4వ తేదీ మంగ‌ళ‌వారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఘనంగా జరుగనుంది.

ఉత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.