ANNUAL FETE CONCLUDES _ ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు
Tirupati, 1 July 2021:The annual Sundararaja Swamy Avatarotsavams concluded in Tiruchanoor on Thursday evening.
Due to Covid restrictions this fete was observed in Ekantam.
Temple DyEO Smt Kasturi Bai and others were present.
ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు
తిరుపతి, 2021 జూలై 01: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు గురువారం ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవర్లకు తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.