ANNUAL KARTHIKA DEEPOTSAVAM ON NOVEMBER 26 _ POURNAMI GARUDA SEVA ON NOVEMBER 27 _ నవంబరు 26న కార్తీక పర్వదీపోత్సవం – నవంబరు 27న పౌర్ణమి గరుడసేవ
ANNUAL KARTHIKA DEEPOTSAVAM ON NOVEMBER 26
POURNAMI GARUDA SEVA ON NOVEMBER 27
Tirumala,24 November 2023: As part of tradition TTD is conducting the annual Karthika Deepotsavam on November 26 at Srivari temple after daily Kainkaryams and Nivedana.
This fete includes litting of ghee Diyas in the temple between 6 pm and 8 pm. The Diyas will be lit at all locations inside the Srivari temple like sub-temples, mandapams mahadwaram, etc. besides the Bedi Anjaneya temple, Sri Varaha Swami temple, and Sri Swami Pushkarani.
In view of the festival, TTD has canceled the Sahara Deepalankara Seva
POURNAMI GARUDA SEVA ON NOVEMBER 27
On Pournami Day, the tradition of conducting Garuda Vahana Seva on November 27 will be observed.
Sri Malayappa Swamy will ride on His favorite Garuda Vahanam on the occasion and bless His devotees along the four mada streets.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 26న కార్తీక పర్వదీపోత్సవం – నవంబరు 27న పౌర్ణమి గరుడసేవ
తిరుమల, 2023 నవంబరు 24 ; తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 26వ తేదీన ఆదివారం సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరుగనుంది. ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవారి అలయంలో కార్తీకమాసంలో కార్తీకదీపోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళామాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేర, తాళ్లపాకవారి అర, భాష్యకారుల సన్నిధి, శ్రీయోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, శ్రీ బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలు వెలిగిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది.
నవంబరు 27న పౌర్ణమి గరుడసేవ
పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 27న సోమవారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.