ANNUAL PAVITHROTSAVAM BEGINS AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
Tirumala, 30 Jul. 20: The annual three-day festival of Pavitrotsavam commenced at the Srivari temple on Thursday with Pavitra Pratistha.
As part of the ritual, the utsava idols of Sri Malayappaswamy and His consorts were seated at Pavitra mandapam for Homa and vaidika programs. Earlier the utsava idols were given Snapana Tirumanjanam. Later vishesha samarpana was also performed in the evening.
Speaking to media later TTD Chairman Sri YV Subba Reddy said Srivari Darshan would continue at Srivari temple following Covid-19 restrictions. He said very soon the humanity across the globe would soon be relieved from pandemic Corona. In view of COVID, Pavitrotsavams will be held in Ekantham on all three days.
HH Sri Sri Sri Chinna Jeeyarswami of Tirumala, TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, Srivari temple Dyeo Sri Harindranath and other officials participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమల, 2020 జూలై 30: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేస్తారు.
అనంతరం సాయంత్రం 6.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని ఆలయంలోని రంగనాయక మండపంలో వేంచేపు చేస్తారు. కాగా సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
భక్తులకు శ్రీవారి దర్శనాలు యథావిధిగా ఉంటుంది : టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ భక్తులకు శ్రీవారి దర్శనాలు యథావిధిగా ఉంటుందని, స్వామివారి అనుగ్రహంతో కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నారు.
ప్రతి ఏడాది తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం అనవాయితీగా వస్తుందన్నారు. ఇందులో భాగంగా గురువారం ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయినట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయంలో మూడు రోజుల పాటు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఛైర్మన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.