ANNUAL SPRING FESTIVAL CONCLUDES _ ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు
TIRUPATI, 21 MAY 2022: The annual three-day Spring Festival, Vasanthotsavam concluded on a grand spiritual note in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Saturday.
As a part of Vasanthotsavam, the utsava deities were offered Snapana Tirumanjanam between 2pm and 4pm. Later in the evening, Unjal Seva and Tiruchi Vahana Seva will be observed. The uniqueness about this temple fete is that all the deities including Sri Kalyana Srinivasa, Sri Devi, Bhudevi, Sri Krishna Swamy with Rukmini and Satyabhama, Sri Sita Lakshmana Anjaneya Sameta Sri Ramachandra Murthy will be rendered Unjal and Tiruchi sevas all at a time.
Temple Special Grade DyEO Smt Varalakshmi, AEO Sri Gurumurthy, Superintendents Sri Ramanaiah, Temple Inspector Sri Srinivasulu, Archaka Sri Seshacharyulu were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు
తిరుపతి, 2022 మే 21: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను వసంతమండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ సీతా రామ లక్ష్మణ ఆంజనేయ, శ్రీ కృష్ణ రుక్మిణీ సత్యభామ ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ జరుగనుంది. అనంతరం రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.