ANNUAL VISESHA PUJA AT TIRUMALA TEMPLE ON JANUARY 23 _ జనవరి 23న శ్రీవారి ఆలయంలో వార్షిక విశేష పూజ
Tirumala, 22 January 2026: On the auspicious occasion of Vasantha Panchami, the annual Visesha Puja will be performed at the Srivari temple in Tirumala on January 23.
Previously, the Visehsa Puja was performed every Monday as a weekly Arjita Seva at the Srivari temple.
However, based on the suggestions of the Jeeyangars, priests, and Agama scholars, to prevent wear and tear of the processional deities of Sri Malayappa Swamy, Sridevi Bhudevi and to preserve them for future generations, TTD had decided to perform the Vasanthotsavam, Sahasra Kalasabhishekam, and the Visesha Puja only as an annual fete.
Accordingly, TTD performs this annual special puja in Ekantam (pilgrims are not allowed) as Sarkar in a year on the day of Vasantha Panchami.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జనవరి 23న శ్రీవారి ఆలయంలో వార్షిక విశేష పూజ
తిరుమల, 2026 జనవరి 22: వసంత పంచమి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో జనవరి 23వ తేదిన వార్షిక విశేష పూజను వైభవంగా నిర్వహించనున్నారు.
గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విషేశపూజను ఏడాదికోసారి నిర్వహించాలని టీటీడీ గతంలో నిర్ణయించింది.
ఈ మేరకు టీటీడీ ప్రతి ఏడాది వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేషపూజను సర్కార్ (ఏకాంతం)గా నిర్వహిస్తోంది.
