AP CJ OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
TIRUMALA, 28 OCTOBER 2023: The Honourable Chief Justice of AP High Court, Justice Dheeraj Singh Thakur offered prayers in the Hill Shrine of Sri Venkateswara Swamy at Tirumala and also in the temple of Goddess Sri Padmavathi at Tiruchanoor on Saturday along with his family.
On his arrival, he was received and darshan arrangements were made at both temples by TTD JEO Sri Veerabrahmam.
After darshan, he was rendered Vedasirvachanam and offered prasadams in both shrines.
DLO Sri Veerraju, DyEOs Sri Lokanatham at Tirumala temple, DyEO Sri Govindarajan in Tiruchanoor temple were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుమల, 2023, అక్టోబరు 28: ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.
అదేవిధంగా, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌కు టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమాల్లో డిఎల్‌వో శ్రీ వీర్రాజు, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.