AP CM INVITED FOR SRI VAKULAMATA MAHA SAMPROKSHANAM _ వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ కు హాజరుకండి

Tirupati,20 2022: TTD EO Sri AV Dharma Reddy on Monday extended an invitation to Honourable CM of AP Sri YS Jaganmohan Reddy to participate in the Maha Samprokshanam festivities of Sri Vakulamata temple near Patakala (Perurbanda) which is scheduled to take place on June 23.

 

TTD EO called on CM  at the latter’s camp office at Tadepalli in Vijayawada and handed over the invitation along with the Minister of AP Sri P Ramachandra Reddy.

 

The TTD EO also presented Srivari Theertha Prasadams while the TTD pundits rendered Vedaashirvachanam to the CM.

 

The Maha Samprokshana festivities have commenced at Sri Vakulamata temple from June 18 onwards and the Maha Samprokshana fete will be performed on June 23.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వకుళ మాత ఆలయ మహాసంప్రోక్షణ కు హాజరుకండి

– ముఖ్యమంత్రిని ఆహ్వానించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుపతి, 2022 జూన్ 20: తిరుపతి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ వద్ద) లో నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జ‌గన్మోహన్ రెడ్డిని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం వీరు సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి క‌లిసి ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాలు అందించి, శాలువతో సన్మానించారు. వేద పండితులు సిఎంకు వేద ఆశీర్వాదం చేశారు.

జూన్ 18వ తేదీ నుంచి శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. జూన్ 23వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది