AP CM LAYS FOUNDATION STONE FOR TTD CHILDREN’S SUPER SPECIALITY HOSPITAL _ టీటీడీ చిన్న పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రి నిర్మాణానికి సిఎంచే శంఖుస్థాప‌న

* INAUGURATES CLEFT PALATE, DEAF & DUMB WARDS AT BIRRD 

·      UNVEILS SRINIVASA SETHU, SOLID WASTE MANAGEMENT PLANT OF TMC PLAQUES

 Tirupati, 05 May 2022: The Honourable Chief Minister of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy on Thursday participated in various development activities of TTD.

He laid the foundation stone plaque for the construction of the Sri Padmavati Children’s super-speciality hospital near Alipiri and also participated in the Bhoomi Puja programme.

Among others, he launched the services of Cleft palate, hearing and dumb wards in BIRRD and unveiled the plaques of the elevated expressway of Srinivasa Sethu and the Solid waste management plant of Tirupati Municipal Corporation.  He also unveiled the online Radio logo of SVBC.

He also witnessed an audio-visual presentation on the Smile Train Cochlear implantation. He also interacted with doctors, and parents of infants who had successfully undergone heart surgeries and spent some quality time with the babies taking selfies and photos.

SRI PADMAVATI CHILDREN’S SUPER SPECIALITY HOSPITAL FOUNDATION:

Spread on 6 acres costing ₹300 crore with a built-up area of 4,11,325 square feet the hospital comprises of a 7 floor building with 350 beds to provide international standard free Medicare to the needy children.

With 15 specialised departments the hospital is the first of its kind in the country, which also treats bone marrow, heart and other transplantations. For emergencies it also houses an air ambulance as well.

The hospital commenced services to poor children last year as part of commitment of former CM of AP late Dr YS Rajasekhar Reddy and has already completed 300 heart surgeries through the government Arogyasree scheme for children who can not bear expenses to the tune of lakhs.

 CLEFT PLALATE, D&D WARDS AT BIRRD 

As part for of mission health for all, the AP government has tied up with NGO Smile Train to provide world class treatment for children for ailments like cleft palate, Deaf & Dumb with speech therapy, behavioural counselling etc to boost morale of the children to lead normal life.

Under the Arogyasree scheme children are also provided with double cochlear implantation surgeries, speech therapy and behavioural counselling and hearing rehabilitation services to poor and middle class families. 

SRINIVASA SETHU

 TTD has patterned with Tirupati Smart City Corporation to build an elevated express highway in Tirupati to facilitate pilgrims with hassle free traffic rides coming for Srivari Darshan from all over the world.

The four lane 7 kms flyover with 17 meter wide was launched at an estimated cost of ₹684 crore with a TTD share of ₹458.28 crore (67%) and rest ₹225.62 (33%) crore share of TSCC and scheduled to be completed by 2023 end with first phase of 3 kms already finished.

 SOLID WASTE MANAGEMENT PLANT OF TMC

 The Tirupati Municipal Corporation has built five solid waste management plants at a cost of ₹83.70 crore which were inaugurated by Honourable CM of AP. The plants are designed to produce gas and manure from solid wet waste, dry waste recycling, building waste recycling and 25 MLD capacity underground treatment Plant.

AP Deputy CM Sri Narayana, Ministers Sri P Ramachandra Reddy, Smt Roja, Smt Rajani, Smt Ushasri Charan, Sri Botsa Satyanarayana, Sri M Nagarjuna, MPs Sri Gurumoorthy, Sri Mithun Reddy, MLAS Sri B Karunakar Reddy Sri C Bhaskar Reddy, Sri B Madhusudhan Reddy, Sri Venkatesh Goud, Sri Adimulam, Sri Sanjeevaiah, Sri Varaprasad, MLCs Sri Srinivasulu Reddy, Sri Kalyana Chakravarti, ZP Chairman Sri Srinivasulu, Mayor Dr Sirisha,  and others were also present.

TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Board members, Sri Ashok Kumar, Sri Krishna Rao, Sri Sriramulu, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao and others officials also present.

Among other important persons Dr Vengamma, Director SVIMS, Dr Srinath Reddy, Director Children’s super specialty hospital, Dr Reddeppa Reddy, Special Officer BIRRD, Municipal Commissioner Kum Anupama Anjali, Smile Train Institute organiser Smt Mamta Carroll and others were also present.

Secretary for CM Sri Solomon Arokiaraj, District Collector Sri Venkatrami Reddy, SP Sri Parameshwara Reddy and other state and district officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ చిన్న పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రి నిర్మాణానికి సిఎంచే శంఖుస్థాప‌న

– బ‌ర్డ్‌లో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ చికిత్స‌ల వార్డులు ప్రారంభం
– ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో లోగో ఆవిష్కరణ

– శ్రీ‌నివాస సేతు, న‌గ‌ర‌పాల‌క సంస్థ సాలిడ్ వేస్ట్ మెనేజ్‌మెంట్ ప్లాంట్ల‌ ప్రారంభోత్స‌వం

తిరుప‌తి, 2022 మే 05: తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి శంఖుస్థాపన, బర్డ్‌లో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ చికిత్స‌ల వార్డులు, శ్రీ‌నివాస సేతు, న‌గ‌ర‌పాల‌క సంస్థ సాలిడ్ వేస్ట్ మెనేజ్‌మెంట్ ప్లాంట్ల‌ను గురువారం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణ ప్రాంగ‌ణం వ‌ద్ద‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రికి టీటీడీ చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి పుష్ప‌గుచ్ఛాలు అందించి స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి శాస్త్రోక్తంగా పూజ‌లు చేసి ఆసుప‌త్రి నిర్మాణానికి శంఖుస్థాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రికి శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల ఆసుప‌త్రి, స్మైల్ ట్రీ కాక్లియ‌ర్ ఇంప్లాంట్స్ దృశ్య మాలిక‌ను ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం వైద్యులు, గుండె ఆప‌రేష‌న్లు చేయించుకున్నచిన్న పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌తో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. త‌రువాత ఎస్వీబిసి ఆన్లైన్ రేడియో లోగోను ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన వివ‌రాలు ఇవీ…..

శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రి నిర్మాణానికి శంఖుస్థాప‌న :

అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీటీడీ చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రిని నిర్మించ‌నుంది. ఇందులో ఏడు అంతస్తులు, 350 పడకలు ఉంటాయి. ఈ ఆసుప‌త్రిలో చిన్నారులకు అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు.

హెమ‌టో ఆంకాల‌జి, మెడిక‌ల్ ఆంకాల‌జి, స‌ర్జిక‌ల్ ఆంకాల‌జి, న్యూరాల‌జి, కార్డియాల‌జి, నెఫ్రాలాజి, గ్యాస్ట్రో ఎంట్రాలజి లాంటి 15 రకాల ప్ర‌త్యేక విభాగాల్లో చిన్నారులకు వైద్య సేవ‌లు, చికిత్స‌లు అందిస్తారు. అంతేగాక అత్యంత ఖరీదైన బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మరియు ఇతర అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేస్తారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఇలాంటి ఆసుప‌త్రి దేశంలోనే మొద‌టిది కాబోతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్‌ అంబులెన్స్‌ సౌకర్యం కలిగి ఉండటం కూడా ఈ ఆస్పత్రి మరో ప్రత్యేకత.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి గారి సత్సంకల్పంతో గత ఏడాది తిరుపతిలో ప్రారంభించిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఎందరో చిన్నారులకు పునర్జన్మను ప్రసాదిస్తోంది. ఆసుపత్రిలో ఇప్పటికే 300 పైగా అరుదైన గుండె శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. లక్షల రూపాయల ఖర్చు భరించగలిగే ఆర్థిక స్తోమత లేని నిరుపేదల చిన్నారులకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఆస్పత్రిలో ఉచితంగా వైద్య సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

బ‌ర్డ్‌లో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ చికిత్స‌ల వార్డులు ప్రారంభం :

మిష‌న్ హెల్త్ ఫ‌ర్ ఆల్ ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తూ పేద‌ల చెంత‌కు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకురావ‌డానికి అనేక చ‌ర్య‌లు తీసుకుంది.

ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం స్మైల్ ట్రైన్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థతో క‌లిసి బ‌ర్డ్ ఆసుప‌త్రిలో గ్ర‌హ‌ణ మొర్రి భాధితుల‌కు ఉచితంగా అధునాతన చికిత్స, వైద్య సేవ‌ల‌ను అందించ‌డానికి ముందుకు వ‌చ్చింది. చికిత్స తర్వాత వీరికి స్పీచ్ థెరపీ, బీహేవియ‌ర‌ల్ కౌన్సెలింగ్ అందిస్తారు. దీనివల్ల వీరు కూడా మనోధైర్యంతో అందరిలాగే సాధారణ జీవితం గడిపే అవకాశం కలుగుతుంది.

అలాగే వినికిడి లోపంతో బాధపడే చిన్నారులకు డబుల్‌ కాక్లియర్‌ ఇన్‌ప్లాంటేషన్‌ సర్జరీ, స్పీచ్‌ థెరపీ, బీహేవియరల్‌ కౌన్సెలింగ్‌, హియరింగ్‌ రిహాబిలిటేషన్‌ తదితర సేవలు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా అందిస్తారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయి.

శ్రీనివాస సేతు :

తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుండి ప్రతి రోజు లక్షమందికి పైగా భక్తులు తిరుపతికి వస్తున్నారు. వీరికి అవసరమైన వసతులు, సదుపాయాలు కల్పించడంతో పాటు సులువుగా తిరుమలకు చేరుకునే సౌకర్యం ఏర్పాటు చేయడానికి టీటీడీ శ్రీనివాస సేతు నిర్మాణంలో కీలక భాగస్వామి అయ్యింది.

తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో టీటీడీ సహకారంతో 4 లైన్లతో కూడిన 7 కి.మీ పొడవు, 17మీ వెడల్పుతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.684 కోట్ల అంచనావ్యయంతో 2019 మార్చి 6న శ్రీనివాస సేతు నిర్మాణానికి పనులు ప్రారంభ‌మ‌య్యాయి.

ఇందులో టీటీడీ తన వాటాగా రూ.458.28 కోట్లు (67%) వ్యయం చేస్తోంది. తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ వాటా రూ.225.72 కోట్లు (33%). శ్రీనివాసం సర్కిల్‌ నుండి వాసవి భవన్‌ సర్కిల్‌ వరకు తొలి దశలో 3 కి.మీ మేర వంతెన నిర్మాణం పూర్తయింది. 2023 చివరి నాటికి మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి టీటీడీ కృషి చేస్తోంది.

న‌గ‌ర‌పాల‌క సంస్థ సాలిడ్ వేస్ట్ మెనేజ్‌మెంట్ ప్లాంట్లు

తిరుప‌తి న‌గ‌ర పాల‌క సంస్థ రూ.83.7 కోట్ల‌తో నిర్మించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌కు చెందిన 5 ప్లాంట్‌ల‌ను ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. ఇందులో త‌డిచెత్త నుండి గ్యాస్ త‌యారీ, త‌డి చెత్త నుండి ఎరువుల త‌యారీ, డ్రై వేస్ట్ రీ సైక్లింగ్, భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల రీ సైక్లింగ్, 25 ఎంఎల్ డి సామ‌ర్థ్యం క‌లిగిన భూగ‌ర్భ డ్రైనేజ్ ట్రిట్‌మెంట్‌ప్లాంట్ ఉన్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శ్రీ నారాయ‌ణ స్వామి, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, శ్రీ‌మ‌తి రోజా, శ్రీ‌మ‌తి విడ‌ద‌ల ర‌జ‌ని, శ్రీ‌మ‌తి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌, శ్రీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీ మేరుగు నాగ‌ర్జున‌, పార్ల‌మొంటు స‌భ్యులు శ్రీ గురుమూర్తి, శ్రీ మిథున్ రెడ్డి, ఎంఎల్ఏలు శ్రీ భూమ‌న్ క‌రుణాక‌ర్ రెడ్డి, శ్రీ చెవిరెడ్డి బాస్క‌ర్ రెడ్డి, శ్రీ బియ్య‌పు మ‌దుసూధ‌న్ రెడ్డి, శ్రీ వెంక‌టే గౌడ‌, శ్రీ సంజీవ‌య్య‌, శ్రీ ఆదిమూలం, శ్రీ వ‌ర ప్ర‌సాద్, ఎమ్మెల్సీలు శ్రీ ఎండ‌వ‌ల్లి శ్రీ‌నివాసులు రెడ్డి, శ్రీ క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, జెడ్‌పి చైర్మ‌న్ శ్రీ శ్రీ‌నివాసులు, మేయ‌ర్ డాక్ట‌ర్‌ శిరీష‌, క‌లెక్ట‌ర్ శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, ఎస్పీ శ్రీ ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి, టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ పోక‌ల అశోక్ కుమార్, శ్రీ మొర్రం శెట్టి రాములు, శ్రీ మ‌ల్లాడి కృష్ణారావు, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయి కృష్ణ యాచెంద్ర, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ ,  శ్రీ ప‌ద్మావ‌తి హృద‌యాల‌యం డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శ్రీ‌నాథ్ రెడ్డి, బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్ర‌త్యేకాధికారి డాక్ట‌ర్ రెడ్డ‌ప్ప‌రెడ్డి, స్విమ్స్ డెరెక్ట‌ర్ డాక్ట‌ర్ వెంగ‌మ్మ‌, మున్సిపల్ కమిషనర్ కుమారి అనుప‌మ అంజ‌లి, ఉప మేయ‌ర్ శ్రీ అభిన‌య్ రెడ్డి, స్మైల్ ట్రైన్ స్వ‌చ్చంద సంస్థ నిర్వ‌హ‌కురాలు శ్రీ‌మ‌తి మ‌మ‌త కౌర‌ల్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.