AP CM OFFERS PATTU VASTRAMS TO VONTIMITTA SRI KODANDARAMA SWAMY _ ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామునికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు

Vontimitta/ Tirupati 2026 April 01: As a part of the ongoing Sri Kodandarama Swamy Brahmotsavams at Vontimitta in Kadapa district, the Honourable of AP Sri N Chandrababu Naidu along with his spouse Smt Bhubaneswari Devi offered Pattu Vastrams to the deity at the temple on the auspicious occasion of Sri Sitarama Kalyanam. 

 

Earlier, upon his arrival, was given a traditional Poornakumbha Swagatam by the temple priests. 

 

On this occasion, the CM was presented with the Shesha Vastram while the Vedic scholars offered Vedic blessings.

 

Later, he was presented with the Tirtha Prasadams and a portrait of Vontimitta Sri Kodanda Rama.

 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                        

 

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామునికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు

 

 

ఒంటిమిట్ట/ తిరుపతి 2026 ఏప్రిల్ 01: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి గౌ.శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీ స‌మేతంగా ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

 

 ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ.ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు టిటిడి చైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు, అర్చ‌కులు పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యంలో ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. 

 

ఈ సంద‌ర్భంగా సీఎంకి శేష‌వ‌స్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. అనంత‌రం స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు, ఒంటిమిట్ట రాముల‌వారి చిత్ర‌ప‌టం అంద‌జేశారు.

 

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.