AP CM PRESENTS SILK VASTRAMS _ శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు
Amaravathi/Tirumala, 15 March 2025: The Honourable Chief Minister of AP Sri Nara Chandrababu Naidu presented Pattu Vastrams to the Utsava deities on the occasion of Srinivasa Kalyanam on Saturday evening at Venkatapalem.
Earlier he carried the Pattu Vastrams over his head in a traditional manner and amidst Mangala Vaidyams from Sri Venkateswara Swamy temple he reached Kalyana Vedika and presented the silks to Utsava deities.
AP Ministers, TTD Chairman Sri BR Naidu, EO Mr. J. Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, board members and other officials participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు
అమరావతి / తిరుమల, 2025 మార్చి 15: వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు బహూకరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది