AP CM REACHES TIRUMALA _ తిరుమలకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వ‌ర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు

TIRUMALA, 12 JUNE 2024: The Honourable CM of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu reached Tirumala on Wednesday evening.
 
He is on a two-day maiden visit to Tirumala after being assumed charge as Head of the State of AP seeking the divine blessings of Sri Venkateswara Swamy.
 
Earlier on his arrival at Gayatri Nilayam Rest House in Tirumala, he was received by JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore.
 
Among other officials, the Principal Secretary Endowments Sri Karikalavalavan, DIG Anantapuram Range Smt Simoshi, Tirupati District Collector Sri Praveen Kumar, SP Sri Harshavardhan Raju, TTD JEO for Health and Education Smt Goutami and others were also present.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వ‌ర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు

తిరుమల, 2024 జూన్ 12: రాష్ట్ర ముఖ్యమంత్రి వ‌ర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయం విశ్రాంతి భవనానికి చేరుకున్నారు.

ముఖ్యమంత్రికి టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

గౌ|| ముఖ్యమంత్రి వ‌ర్యులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కరికాలవలవన్, అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీమతి సిమోషి, తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్, ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ(ఆరోగ్య, విద్యాశాఖ) జేఈవో శ్రీమతి గౌతమి తదితర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.