AP CM TO PARTICIPATE IN VARIOUS DEVELOPMENT PROGRAMS _ టీటీడీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిచే శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు
Tirupati, 04 May 2022:
Tirupati, 04 May 2022: The Honourable CM of AP Sri YS Jaganmohan Reddy will take part in a series of development and inauguration programs mulled by TTD on May 5.
As part of it, the CM will lay the foundation stone to Sri Padmavathi Children’s Super Speciality Hospital. The hospital is coming up on a 6-acre site near Alipiri in a 4,11, 325sq.ft built-in area, comprising a-seven floor building,350-beds at a cost of ₹300 crore.
The Hospital will have 15 special wings of Paediatric treatment viz. Haemato Oncology, Medical Oncology, Surgical Oncology, Neurology, Cardiology, Nephrology, Gastro Enterology etc. besides, Bone marrow, heart and other organ transplantations will also be carried out to the needy children free of cost. This hospital is going to be a landmark institution in Rayalaseema.
Later the CM will open Cleft Palate, Deaf and Dumb wards in BIRRD hospital with the support of Mission Health for All, AP government has conceived corporate level treatment to children in government institutions.
In a first of its kind, the AP Government along with an international voluntary organisation-Smile Train will offer free service in behavioural counselling and speech therapy to patients below 16 years with Cleft Palate in Tirupati.
Afterwards, the CM will inaugurate Sri Venkateswara Institute of Cancer and Advance Research (SVICAR) constructed by the TATA trust, spread over 1,65,000 sq.ft at a cost of ₹180 crore is decked up with state-of-art medical equipment.
Comprising of all infrastructures and providing international standards of medical services is the sole objective of this institute that aims at qualitative and affordable services in Medical, Surgical and Radiation Oncology.
A new complex has been built with 92 in-patient beds and modern medical equipment to provide quality Medicare.
The Tata Trust which is already running cancer hospitals across many states is now managing the SV Tata Cancer hospital especially for poor people of Rayalaseema.
The Government of AP is striving to transform Tirupati into a role model pilgrim Center by developing it into a Smart City. As per the 2022 demography assessment, Tirupati Municipal Corporation has a population of 7.29 lakhs. Every day Tirupati witnesses a floating population of one lakh pilgrims for Tirumala Srivari darshan from all over the world.
TTD collaborated in the construction of Srinivasa Sethu, an elevated express highway corridor in Tirupati to address the traffic problems and to facilitate the speedy transport of pilgrims to Tirumala besides other infrastructure for accommodation and basic amenities.
TTD has contributed Rs. 458.28cr on this ₹684 crore covering 7km. In the first phase, the construction of 3 kms of elevated flyover from Srinivasam circle to Vasavi Bhavan circle is completed so far which will be inaugurated by the CM of AP on May 5.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
టీటీడీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిచే శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు
తిరుపతి, 2022 మే 04: ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి మే 5 బుధవారం తిరుపతిలో టీటీడీకి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవి….
శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి శంఖుస్థాపన :
శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మిస్తారు. ఇందులో ఏడు అంతస్తులు, 350 పడకలు ఉంటాయి. ఈ ఆసుపత్రిలో చిన్నారులకు అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు.
హెమటో ఆంకాలజి, మెడికల్ ఆంకాలజి, సర్జికల్ ఆంకాలజి, న్యూరాలజి, కార్డియాలజి, నెఫ్రాలాజి, గ్యాస్ట్రో ఎంట్రాలజి లాంటి 15 రకాల ప్రత్యేక విభాగాల్లో చిన్నారులకు వైద్య సేవలు, చికిత్సలు అందిస్తారు. అంతేగాక అత్యంత ఖరీదైన బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మరియు ఇతర అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇలాంటి ఆసుపత్రి దేశంలోనే మొదటిది కాబోతుంది.
బర్డ్‌లో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ వార్డులు ప్రారంభం :
ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి బర్డ్‌లో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ వార్డులు ప్రారంభిస్తారు. మిషన్ హెల్త్ ఫర్ ఆల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తూ పేదల చెంతకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకుంది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మైల్ ట్రైన్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి గ్రహణ మొర్రి భాధితులకు ఉచితంగా అధునాతన చికిత్స, వైద్య సేవలను అందించడానికి ముందుకు వచ్చింది. చికిత్స తర్వాత వీరికి స్పీచ్ థెరపీ, బీహేవియరల్ కౌన్సెలింగ్ అందిస్తారు. దీనివల్ల వీరు కూడా మనోధైర్యంతో అందరిలాగే సాధారణ జీవితం గడిపే అవకాశం కలుగుతుంది.
శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ అఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రిసెర్చ్ (స్వీకార్) ఆసుపత్రి ప్రారంభోత్సవం :
టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక లక్షా 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 120 కోట్ల రూపాయల వ్యయంతో విశాలమైన భవనాలు, అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. రోగులకు కావలసిన అన్ని వసతులు సమకూరుస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందించే ఈ ఆసుపత్రిలో మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీ లాంటి క్యాన్సర్లకు వైద్యసేవలు అందిస్తారు. ఈ ఆసుపత్రిలో 92 ఇన్‌పేషెంట్ పడకలతో నూతన భవనాలను నిర్మించింది.
శ్రీనివాససేతు మొదటి దశ వంతెన ప్రారంభం :
తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఆదర్శవంతమైన పవిత్ర యాత్రాస్థలంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. 2022 జనాభా లెక్కల ప్రకారం తిరుపతి కార్పొరేషన్ జనాభా 7.29 లక్షలు. తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుండి ప్రతి రోజు లక్షమందికి పైగా భక్తులు తిరుపతికి వస్తున్నారు. భక్తులకు అవసరమైన వసతులు, సదుపాయాలు కల్పించడంతో పాటు సులువుగా తిరుమలకు చేరుకునేందుకు టీటీడీ శ్రీనివాస సేతు నిర్మాణంలో కీలక భాగస్వామి అయ్యింది.
తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం తిరుపతి స్మార్ట్‌సిటీకార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 6.86 కిమీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇందుకోసం రూ.684 కోట్ల అంచనావ్యయంతో 2019 మార్చి 6వ తేదీ శ్రీనివాస సేతు నిర్మాణానికి పనులు ప్రారంభించారు. మొదటి దశలో శ్రీనివాసం సర్కిల్ నుండి వాసవి భవన్ సర్కిల్ వరకు 3 కి.మీ మేర వంతెన నిర్మాణం పూర్తయింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.