AP CM TO PRESENT SRIVARI PATTU VASTRAM ON SEP 27 _ సెప్టెంబరు 27న ముఖ్యమంత్రివర్యులు శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

AP CM TO INAUGURATE PARAKAMANI BHAVAN ON SEPT 28

 

DO NOT BELIEVE IN MALICIOUS CAMPAIGN ON SRIVANI TRUST

 

TTD BOARD TO DECIDE SOON ON GOLD PLATING OF SRIVARI TEMPLE

 

TTD TO CONDUCT BHUMI PUJA OF MUMBAI SV TEMPLE

 

Tirumala,10 September 2022 : TTD EO Sri AV Dharma Reddy said that the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy would present pattu vastrams on September 27 and also inaugurate the brand new Parakamani Bhavan on September 28.

Addressing newsmen at Annamaiah Bhavan after the Dial Your EO program on Saturday morning, the TTD EO said Honourable CM will also participate in the Pedda Sesha vahana on the night of September 27.

TTD EO said the Parakamani Bhavan built at a cost of ₹23 crore donation has all ultra modern facilities for counting coins, currencies and strong rooms. Besides coins, an automatic segregation machine costing ₹2.50 crore, machines for counting and packing coins in sachets, tables and chairs, fresh rooms toilets TTD had provided glass walls on both sides for devotees to view the process from outside. He said the Parakamani space inside Srivari temple would soon be cleaned and made available for devotees to sit after Srivari darshan.

 

DO NOT BELIEVE IN MALICIOUS CAMPAIGN ON SRIVANI TRUST

 

 

TTD EO appealed to devotees not to believe in the malicious campaign by some vested interests that the SRIVANI Trust funds were usurped by the state government.

 

He said the Trust has collected a sum of ₹516 crore so far and the TTD Board decided to build 1342 temples in remote areas for the benefit of SC/ST/BC and fishermen communities. 
In the first phase 502 temples have been built and work has begun in coordination with Samarasata Seva Foundation to build 111 temples in second phase at a cost of ₹10 lakhs for each temple.TTD is setting aside ₹2000 per month for conduct of Dhoopa and Deepa activities in these temples besides training youth from these regions at SVETA Bhavan in archakas skills and appoint them later in these temples. 

 

He said a separate Audit team has been constituted which will inspect the maintenance, expenditure of all these temples. TTD has so far sanctioned funds from the trust for the rejuvenation of 110 ancient and dilapidated temples so far in AP, TS and TN also. He also said the list of all the temples constructed under SRIVANI Trust funds will be displayed on TTD website for more transparency.

 

TTD BOARD TO DECIDE ON GOLD PLATING OF THE SRIVARI TEMPLE

 

 

TTD EO said after consultation with archakas, Agama Pundits and the Tirumala Pontiffs-the Jeeyar Swamis, TTD Board intends to take up gold plating of the Ananda Nilayam Vimanam of Srivari temple.

 

 

SRIVARI TEMPLE AT NAVI MUMBAI

 

 

 

TTD EO said the Maha Government has allotted a 10 acre land in Ulwe region of Navi. But since the temple is coming close to Arabian Sea, Coastal Regulation Zone clearances are needed to construct the temple. “Our team is already working on it and once we get the clearance, we will go for the construction of temple after performing Bhoomi Puja”, he maintained.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 27న ముఖ్యమంత్రివర్యులు శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

– సెప్టెంబరు 28న ముఖ్యమంత్రివర్యుల చేతులమీదుగా పరకామణి భవనం ప్రారంభం

– శ్రీవాణి ట్రస్టుపై దుష్ప్రచారాన్ని నమ్మకండి

– శ్రీవారి ఆలయ ఆనందనిలయ విమాన గోపురానికి బంగారు తాపడం విధివిధానాలపై వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం

– త్వరలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

తిరుమ‌ల‌, 2022 సెప్టెంబ‌రు 10: శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సెప్టెంబర్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం ఈఓ మీడియాతో మాట్లాడారు.

సెప్టెంబరు 27న రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రివర్యులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, అనంతరం రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే పెద్దశేష వాహనసేవలో పాల్గొంటారని తెలిపారు. సెప్టెంబరు 28న ఉదయం ముఖ్యమంత్రివర్యులు పరకామణి నూతన భవనాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆధునిక వసతులతో ఏర్పాటుచేసిన ఈ భవనంలో కానుకల లెక్కింపును భక్తులు చూసేందుకు వీలుగా రెండువైపులా అద్దాలు ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి ఆలయం నుంచి హుండీలను బ్యాటరీ కార్ల ద్వారా పరకామణి భవనానికి తరలిస్తామని చెప్పారు. కానుకలు లెక్కించేందుకు సిబ్బంది కింద కూర్చోవాల్సిన అవసరం లేకుండా టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక్కడ కానుకలు భద్రపరిచేందుకు వీలుగా స్ట్రాంగ్ రూములు నిర్మించామన్నారు. నాణేలను వేరు చేసేందుకు రూ.2.50 కోట్లతో కాయిన్స్ ఆటోమేటిక్ సెగ్రిగేషన్ మిషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆ తర్వాత మరో యంత్రం సాయంతో కౌంటింగ్, ప్యాకింగ్ చేస్తామని తెలియజేశారు. సిబ్బంది కోసం మరుగుదొడ్లు, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ పరకామణి భవనంలో కార్యకలాపాలు మొదలైన తర్వాత ఆలయం లోపల ఉన్న పరకామణి స్థలాన్ని ఖాళీ చేసి భక్తులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. నూతన పరకామణి భవనంలోనే డోనార్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాత అందించిన రూ.23 కోట్ల విరాళంతో పరకామణి భవనం నిర్మించినట్లు ఈవో తెలియజేశారు.

శ్రీవాణి ట్రస్టుపై దుష్ప్రచారాన్ని నమ్మకండి

శ్రీవాణి ట్రస్టు నిధులను ఆలయ నిర్మాణాలకు, పురాతన ఆలయాల పునరుద్ధరణకు మాత్రమే వినియోగిస్తున్నామని, ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతున్నాయని కొందరు పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. ఈ ట్రస్టుకు ఇప్పటివరకు రూ.516 కోట్ల విరాళాలు అందాయని తెలియజేశారు. ఈ నిధులతో తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లో 1342 ఆలయాల నిర్మాణం చేపట్టాలని టిటిడి నిర్ణయించిందన్నారు. మొదటి దశలో 502 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, ఆయా ఆలయాల్లో భక్తులు దర్శనం చేసుకుంటున్నారని తెలియజేశారు. సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో రెండో దశలో 111 ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లోని గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో ఆలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. పూర్తయిన ఆలయాలకు ధూప దీప నైవేద్యాలతో కోసం ప్రతినెలా రూ.2 వేలు అందించాలని టిటిడి నిర్ణయించిందన్నారు. ఈ ఆలయాలు ఉన్న ప్రాంతాల్లో వెనకబడిన వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేసి శ్వేతలో అర్చక శిక్షణ ఇచ్చి అర్చకులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆలయాలను ఆడిట్ బృందం సందర్శించి ఆలయ నిర్వహణ, నిధుల వ్యయంపై ఆడిట్ చేస్తుందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఇప్పటి వరకు శిథిలావస్థకు చేరుకున్న 110 పురాతన ఆలయాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసినట్లు తెలియజేశారు. మరింత పారదర్శకత ఉండేలా శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించిన ఆలయాల జాబితాను టిటిడి వెబ్ సైట్లో కూడా పొందు పరుస్తామన్నారు.

శ్రీవారి ఆలయ ఆనందనిలయ విమాన గోపురానికి బంగారు తాపడం విధివిధానాలపై వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం

తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులకు సంబంధించిన విధి విధానాలపై ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ఆగమపండితులు అధ్యయనం చేస్తున్నారని, వచ్చే బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు.

త్వరలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో త్వరలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తామని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల భూమికి నిబంధనల ప్రకారం లీజు పొంది స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ స్థలం సముద్ర తీరప్రాంతంలో ఉండడంతో కోస్టల్ రెగ్యులేషన్ జోన్(CRZ) అనుమతి అవసరం అయింది అన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేశామని, దీంతోపాటు ఆలయ ప్లానుకు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లభించిన తర్వాత ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తామని తెలియజేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.