AP GUV AND THE CM OFFERS PRAYERS _ అమ‌రావ‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని దర్శించుకున్న గౌ|| రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌, గౌ|| ముఖ్యమంత్రి

AMARAVATHI/TIRUMALA, 15 MARCH 2025: The Honourable Governor of AP Sri Abdul Nazir along with the Honourable CM of AP Sri N Chandrababu Naidu offered prayers in Sri Venkateswara Swamy temple at Venkatapalem on Saturday evening.

Later they reached Kalyana Vedika where the celestial wedding ceremony of Srinivasa Kalyanam is set to take place in a grand manner and offered prayers to the Utsava deities of Sri Bhu sameta Sri Srinivasa Swamy also.

Ministers, TTD Trust Board Chairman Sri BR Naidu, EO Sri Syamala Rao, trust board members, Additional EO Sri Ch Venkaiah Chowdary and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అమ‌రావ‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని దర్శించుకున్న గౌ|| రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌, గౌ|| ముఖ్యమంత్రి

అమరావతి / తిరుమల, 2025 మార్చి 15: అమ‌రావ‌తిలోని వెంకట పాలెం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు దంప‌తులు కలిసి శ‌నివారం దర్శించుకున్నారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న‌గౌ|| ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, టిటిడి ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రి సాంప్ర‌దాయ బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు.

అనంత‌రం ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు, టిటిడి ఛైర్మన్, బోర్డు స‌భ్యులు స్వాగ‌తం ప‌లికారు.

అనంతరం గౌ|| రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌, గౌ|| ముఖ్యమంత్రి ధ్వజస్తంభం, గరుడ ఆళ్వార్ వద్ద నమస్కరించి, శ్రీవారి సన్నిధికి చేరారు. స్వామివారి దర్శనం అనంతరం సన్నిధిలో అర్చన, హారతి, తీర్థాలు అందించారు.

ఈ సందర్భంగా మహా మండపంలో గౌ|| రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌, గౌ|| ముఖ్యమంత్రివర్యులకు టిటిడి ఛైర్మన్, టిటిడి ఈవో , టిటిడి అదనపు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాలను అందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ పెద్ద జీయర్, శ్రీ శ్రీ చిన్న జీయర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ నన్నూరి నర్సిరెడ్డి, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ ఎం.శాంతారాం, శ్రీమతి తమ్మిశెట్టి జానకి దేవి, శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీ ఎస్ నరేష్ కుమార్, శ్రీ జీ.భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.