AP HIGH COURT CJ PRAYS AT TIRUMALA శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
Tirumala, 12 Sep. 21: The Chief Justice of AP High court Honourable Justice Sri Arup Kumar Goswami offered prayers at the Srivari temple on Sunday.
He was received with traditional Istikaphal honours at the temple Mahadwaram by TTD Additional EO Sri AV Dharma Reddy before he was led to Darshan of Sri Venkateswara Swamy.
Thereafter the TTD Veda pundits rendered Veda Aseervachana to the Chief Justice at the Ranganayakula Mandapam.
The Additional EO along with CVSO Sri Gopinath Jatti presented Shesha Vastram, Thirtha Prasadam and Srivari Portraits to Honourable Chief Justice.
Srivari Temple DyEO Sri Ramesh Babu and other officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుమల, 2021 సెప్టెంబరు 12: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ అరుప్ కుమార్ గోస్వామి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్ద టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తీకఫాల్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపట్టాన్ని గౌ|| ప్రధాన న్యాయమూర్తికి అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.