APPALAYAGUNTA VENKANNA SHINES IN PALLAKI VAHANA _ పల్లకీలో మోహినీ అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
Tirupati, 4, June 2023: On Sunday as part of the ongoing annual Brahmotsavam celebrations of Sri Prasanna Venkateswara temple, Lord rode on pallaki Vahana in Mohini alankaram and blesses devotees.
The celestial entourage of Swami with Mangala vadyams, bhajans and kolatas on Mada Street enthralled the devotees.
Later a grand snapana thirumanjanam was performed to the utsava idols of Swami and his consorts.
In the evening Swami will ride his favourite Garuda Vahana and bless devotees.
Dyeo Sri Govindarajan, Superintendent Smt Srivani, and Inspector Sri Shiv Kumar were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పల్లకీలో మోహినీ అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
తిరుపతి, 2023 జూన్ 04: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారు మోహినీ అలంకారంలో దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
అనంతరం ఉదయం 9.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.
రాత్రి 7 గంటల నుండి విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.