APPLICATIONS INVITED FOR VACANCIES IN NALAYAR DIVYA PRABANDAM PARAYANAM SCHEME _ నాలాయిర దివ్య ప్ర‌బంధ పారాయ‌ణ స్కీమ్‌లో ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Tirupati, 1 Jan. 22: TTD has invited applications a second time from qualified Sri Vaishnava Brahmins from all over the country for category 1, 2 vacancies to discharge duties as examiners in the TTD Nalayar Divya Prabanda Parayanam Scheme for the year 2021-22.

The selected candidates would be paid monthly salaries and expected to perform parayanams at the Srivari temple.

Interested candidates can procure applications on the TTD website www.tirumala.org

The candidates have to submit their applications by January 25 evening before 5 pm to the address “ Special Officer, Nalayar Divya Prabandam parayanam scheme, Alwar Divya Prabandam project, TTD, SVETA Bhavan Tirupati-517502.

Those who have already applied need not repeat again. For more details dial 0877-2264519 during office hours.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నాలాయిర దివ్య ప్ర‌బంధ పారాయ‌ణ స్కీమ్‌లో ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

తిరుప‌తి, 2022, జ‌న‌వ‌రి 01: టిటిడి నాలాయిర దివ్య ప్ర‌బంధ పారాయ‌ణ స్కీమ్‌లో 2021-22 సంవ‌త్స‌రానికి గాను కేట‌గిరి -1, 2 మ‌రియు ప‌రిశీల‌కులుగా ప‌నిచేసేందుకు నాలాయిర దివ్య‌ప్ర‌బంధం చ‌దివిన దేశ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వైష్ణ‌వ బ్రాహ్మ‌ణుల నుండి రెండోసారి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించ‌డ‌మైన‌ది. ఎంపికైన వారు నెల‌వారీ సంభావ‌న ప్రాతిప‌దిక‌న శ్రీ‌వైష్ణ‌వ ఆల‌యాల్లో నాలాయిర దివ్య‌ప్ర‌బంధం పారాయ‌ణం చేయాల్సి ఉంటుంది. www.tirumala.org వెబ్‌సైట్ నుండి ద‌ర‌ఖాస్తులు పొంద‌వ‌చ్చు.

పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను 2022, జ‌న‌వ‌రి 25వ తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు “ప్ర‌త్యేకాధికారి వారి కార్యాల‌యం, నాలాయిర దివ్య‌ప్ర‌బంధ పారాయ‌ణ స్కీమ్‌, ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ములు, శ్వేత భ‌వ‌నం, తిరుప‌తి – 517502” చిరునామాకు పంపాల్సి ఉంటుంది. మొద‌టి సారి ద‌ర‌ఖాస్తు చేసిన వారు తిరిగి పంపాల్సిన అవ‌స‌రం లేదు. ఇతర వివ‌రాల‌కు 0877-2264519 నంబ‌రులో కార్యాల‌య వేళ‌ల్లో సంప్ర‌దించ‌గ‌ల‌రు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.