APPLICATIONS INVITED IN SVMDC _ ఎస్వీ సంగీత కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
TIRUPATI, JUNE 14: Applications have been invited from interested candidates who want to take up fine arts as their career in TTD-run Sri Venkateswara College of Music and Dance in Tirupati for the academic year 2013-14.
Apart from Carnatic music (vocal), Nadaswaram, Dance, Talam, Harikatha, B Music, M Music as regular courses, diploma and certificate courses are also available in the evening college. The students who would like to join in these courses of their choice can pay Rs.25 for the application.
The candidates should send the fill in application along with two sets of pass-port size photos and post-cards along with xerox copies of TC and Marks list to the address-Principal, SV College of Music and Dance, Balaji Colony, Tirupati – 517502 on or before June 30, 2013.
Meanwhile, the college has also introduced two-year course – Kalapravesika in Dance and Vocal. Anybody including housewives and children who are interested in learning classical dance and music can apply for this course irrespective of their age and qualification.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ సంగీత కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి, జూన్ 14, 2013: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాలలో 2013-14వ విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కళాశాలలో సంగీతం, నాట్యం, తాళం, హరికథ, నాదస్వరం, బి.మ్యూజిక్, ఎం.ఏ మ్యూజిక్ తదితర రెగ్యులర్ కోర్సులతో పాటు సర్టిఫికెట్, డిప్లొమా లాంటి సాయంకాల కోర్సులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయం పనివేళల్లో రూ.25/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు.
పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు రెండు ఫొటోలు, సొంత చిరునామా గల రెండు పోస్టుకార్డులు, టి.సి, మార్క్‌లిస్టు జెరాక్స్ కాపీలను జతపరిచి జూన్ 30వ తేదీలోపు ”ప్రిన్సిపాల్, యస్.వి సంగీత, నృత్య కళాశాల, బాలాజీ కాలని, తిరుపతి – 517502” అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు కళాశాల కార్యాలయ పనివేళల్లో 0877-2264597 నంబరులో సంప్రదించగలరు.
కాగా కళాశాలలో ఈ ఏడాది రెండు సంవత్సరాల వ్యవధి గల సంగీత/నృత్య కళాప్రవేశిక కోర్సును నూతనంగా ప్రవేశపెట్టారు. దీనికి వయసుతో, చదువుతో నిమిత్తం లేదు. ఔత్సాహికులైన యువత, గృహిణులు, చిన్న పిల్లలు, స్థానికుల సౌలభ్యం కోసం దీన్ని ప్రవేశపెట్టారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది