ARRANGEMENTS COMPLETED FOR SITARAMA KALYANOTSAVAM AT VONTIMITTA: TTD _ ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి: టిటిడి
- TTD AND DISTRICT OFFICIALS JOINTLY MAKING EXTENSIVE ARRANGEMENTS
- FREE FOOD ( ANNAPRASADAM), DRINKING WATER, BUTTERMILK FOR DEVOTEES
- DISTRIBUTION OF THALAMBRALU PACKETS AND SRIVARI PRASADAM
Vontimitta / Tirupati, March 31, 2026: The Tirumala Tirupati Devasthanams (TTD) has completed all arrangements to conduct the grand Sri Sitarama Kalyanam at Vontimitta on Wednesday, April 1, from 6:30 PM to 8:30 PM.
Under the directions of TTD EO Sri M. Ravichandra, senior TTD officials coordinated with district authorities to ensure smooth arrangements for devotees.
Chief Minister’s Offering
On April 1 at 6:00 PM, Hon’ble Chief Minister Sri Nara Chandrababu Naidu will present silk garments on behalf of the State Government.
Engineering & Facilities
• Seating for 60,000 devotees across 121 galleries.
• Paramedical staff, TTD employees, police, and volunteers stationed in each gallery.
• 28 kiosks for distribution of Thalambralu.
• Each devotee will receive pearl Thalambralu, Srivari laddu prasadam, kankanam (wrist thread), and annaprasadam.
• 11 shelters with buttermilk, panakam (jaggery water), coolers, medical staff, and police for walking devotees.
• Shaded pandals and water sprinklers along the procession route.
• German sheds for 3,000 devotees near the temple for queue management.
• 21 LED screens for viewing the Kalyanam.
• 38 illuminated deity cutouts and signboards for easy navigation.
Security
• Vigilance, observation teams, fire staff (510), TTD scouts (200), and 3,000 police personnel deployed.
• 235 CCTV cameras, 12 drones, a central command control center, and 3 sub-control rooms.
• Parking facilities: 13 areas on Kadapa side, 5 on Tirupati side.
• Lighting and signboards along 21 km, mobile patrolling teams.
Annaprasadam
• Continuous food distribution from morning to night at temple and venue.
• Menu includes rice, sambar, rasam, buttermilk, chutney, curry, jaggery pongal.
• Evening snacks: pulihora, rava kesari, Mysore pak, biscuits, karasu, banana, tissue, wooden spoon.
• 3 lakh water bottles, 2 lakh buttermilk packets, 1 lakh tetra packs.
Transport
• RTC buses: 85 buses from Kadapa (425 trips), 40 buses from Rajampet (200 trips), totaling 625 trips.
• 20 buses from traffic diversion points to the venue.
Floral Decorations
• 12 tons of traditional flowers, 1 lakh cut flowers.
• For the first time, a mini Ramayana art installation in temple premises.
Cultural Programs
• Govindanama parayana, Ramnama bhajanamrutam, and cultural performances.
Medical Services
• 13 medical camps, 250 paramedical staff, 35 doctors, 8 ambulances, fire services.
Sanitation
• 250 toilets, 3,268 sanitation workers deployed.
Deputation Staff & Volunteers
• 500 TTD deputation staff, 2,500 Srivari sevaks assisting devotees.
SVBC Telecast
• Live HD broadcast of Sri Sitarama Kalyanotsavam for devotees worldwide.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి: టిటిడి
– టీటీడీ, జిల్లా అధికారులు సమిష్టిగా విస్తృత ఏర్పాట్లు
– భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ
– భక్తులకు తలంబ్రాలు ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం సిద్ధం
ఒంటిమిట్ట / తిరుపతి, 2026 మార్చి 31: ఒంటిమిట్టలో బుధవారం సాయంత్రం 6. 30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు టీటీడీ ఉన్నత అధికారులు, జిల్లా అధికారులతో సమిష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
• ఏకశిలానగరంలో ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణాన్ని టిటిడి, జిల్లా యంత్రాంగం సమన్వయంతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ముఖ్యమంత్రివర్యులు పట్టువస్త్రాలు సమర్పణ
– శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా ఏప్రిల్ 1న సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఇంజినీరింగ్:
• కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 121 గ్యాలరీలలో 60 వేల మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు.
• ప్రతి గ్యాలరీలో భక్తులకు సకాలంలో సేవలు అందెలా పారా మెడికల్ సిబ్బంది, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు.
• కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 28 కియోస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశారు.
• కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు.
• నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు. ఇందులో పానకం, మజ్జిగ, చలివేంద్రం, వాటర్ కూలర్లు, పోలీస్, మెడికల్ సిబ్బంది ఏర్పాటు
– శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు భక్తులు చల్లని వాతావరణంలో నడిచేందుకు వీలుగా చలువ పందిళ్లు, నీటి పిచుకారి యంత్రాలు ఏర్పాటు.
– ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్లలో వెళ్ళెందుకు జర్మన్ షెడ్డు ఏర్పాటు.
• శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్ఈడీ స్క్రీన్ లు.
• ఆలయం, కల్యాణ వేదిక, పరిసర ప్రాంతాల్లో 38 వివిధ దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు, భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులు ఏర్పాటు.
నిఘా మరియు భద్రత:
• టిటిడి విజిలెన్స్ విభాగం, అబ్జర్వేషన్ టీం, ఫైర్ సిబ్బంది 510 మంది, టిటిడి స్కౌట్స్ 200 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం 3,000 మంది సేవలు
• అదేవిధంగా 235 సిసి కెమెరాలు, 12 డ్రోన్ లు, కామాన్ కమెండ్ కంట్రోల్ సెంటర్, మరో మూడు 3 సబ్ కంట్రోల్ రూమ్ ల నుండి పర్యవేక్షణ.
• కళ్యాణానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కడప వైపు 13, తిరుపతి వైపు 5 చోట్ల పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు.
– దాదాపు 21 కి.మీ మేర లైటింగ్, సూచిక బోర్డులు, మొబైల్ పెట్రోలింగ్, పర్యవేక్షణ టీంలు.
అన్నప్రసాదాలు:
• బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో, కల్యాణ వేదిక వద్ద నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ.
• ఇందులో రుచికరమైన అన్నం, సాంబరు, రసం, మజ్జిగ, పచ్చడి, కర్రీ, బెల్లం పొంగలి అందిస్తారు.
• కల్యాణాన్ని వీక్షించేందుకు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు సాయంత్రం నుండి పులిహోర, రవ్వ కేసరి, మైసూర్ పాక్, బిస్కెట్ ప్యాకెట్, కారాసు, అరటిపండు, టిష్యూ పేపర్, ఉడెన్ స్పూన్, 3 లక్షల తాగునీరు బాటిల్స్, వాటర్ టబ్బుల ద్వారా నీటి సరఫరా, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, లక్ష టెట్రా ప్యాకెట్లు
రవాణా
• ఆర్‌టిసి ద్వారా కడప నుండి ఒంటిమిట్ట వరకు 85 బస్సులతో 425 ట్రిప్పులు, రాజంపేట నుండి ఒంటిమిట్ట వరకు 40 బస్సులతో మొత్తం 625 ట్రిప్పుల ద్వారా భక్తులకు రవాణా సౌకర్యం.
• ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కల్యాణ వేదిక వరకు 20 బస్సులు ఏర్పాటు.
పుష్పాలంకరణలు:
• కల్యాణ వేదిక, ఆలయం, పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు.
• మొదటిసారి ఆలయ ప్రాంగణంలో కళాకృతులుతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాలు:
– శ్రీ సీతా రాముల కల్యాణంలో గోవిందనామ సరళిలో శ్రీ రామనామ భజనామృతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వైద్యం:
• 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
పారిశుద్ధ్యం:
• కళ్యాణ వేదిక, ఆలయ పరిసరాలలో 250 మరుగుదొడ్లు, టిటిడి, జిల్లా యంత్రాంగం సమన్వయంతో 3,268 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తారు.
డిప్యూటేషన్ సిబ్బంది – శ్రీవారి సేవకులు:
• 500 మంది టీటీడీ డిప్యూటేషన్ ఉద్యోగులు, 2500 మంది శ్రీవారి సేవకులు, భక్తులకు సౌకర్యవంతంగా సేవలు అందిస్తారు.
ఎస్వీబీసీ
- శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా హెచ్‌డి క్యాలిటీతో ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు.


















