ARTFORMS ENTRALLS _ సర్వభూపాల వాహన సేవలో అలరించిన క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

TIRUPATI, 15 NOVEMBER 2023: The various artforms in front of Sarva Bhupala Vahana Seva enthrall the pilgrims on Wednesday.

 

Kolatam, Shelangai Attam, Chandi Melam, Folk dances apart from portrayal of mythological characters have immensely attracted the devotees.

 

Artistes from all the southern states showcased their skills.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సర్వభూపాల వాహన సేవలో అలరించిన క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

తిరుపతి, 2023 నవంబరు 15: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన బుధవారం ఉద‌యం సర్వభూపాల వాహన సేవలో వివిధ రాష్ట్ర‌ల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చాయి . టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 12 కళాబృందాలలోని కళాకారులు సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవశింప చేశారు.

రాజమండ్రికి చెందిన భువనేశ్వరి తల్లి భజన మండలిలోని 25 మంది కళాకారుల గిరిజన నృత్యం, 50 మంది యువతుల శివ పార్వతి నాట్యం, గోపికలు కృష్ణుల డాన్స్ కనువిందు చేసింది.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని పెరిందేవి నాట్యాలయంకు చెందిన 20 మంది యువతుల బృందం, తిరుపతి ఎస్వి సంగీత నృత్య కళాశాలకు చెందిన 22 మంది చిన్నారుల బృందం అన్నమయ్య సంకీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శన నయనానందకరంగా సాగింది.

కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన 24 మంది మహిళల బృందం చండి మేళం ప్రదర్శన ఆకట్టుకుంది.

తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ కు చెందిన 26 మంది కళాకారులు పెరుం చలంగై ఆటం నృత్యం, చెన్నైకి చెందిన శ్రీహరి భజన మండలిలోని 23 మంది మహిళల కోలాటం, ఫోక్ డాన్స్, అల్లూరి సీతారామరాజు జిల్లా విజయ దుర్గ కోలాట భజన మండలికి చెందిన 15 మంది యువతుల కోలాటం, వివిధ దేవత మూర్తుల వేషధారణ భక్తులను విశేషంగా ఆకర్షించింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.