ARTISTIC SPLENDOR DURING GAJA VAHANAM PROCESSION _ గజ వాహన సేవలో కళా వైభవం

Tirumala, 29 September 2025: The royal look of the magnificent Gaja Vahana Seva enhanced with the rich dance performances by various artists held as a part of the Srivari Salakatla Brahmotsavams on Monday evening.

A total of 21 art troupes from a total of 10 states comprising 463 artists mesmerized the devotees with their skillful performances.

Main attractions:

•  Artists from Karnataka performed Gajendra Vaibhavam and Banjara dance.

 * The groups from Andhra Pradesh and Tirupati performed traditional dances like Mayura Nrityam, Kolatam and Gajendra Moksham.

•  The famous Perini dance performed by a group from Telangana State impressed the large crowd.

•  The Odissi dance performance by artists from Orissa showcased the splendor of classical art.

•  The artists from Tamil Nadu specially performed Kamsali Ruchita, Tamil Nadu folk dance and Oilattam (Pondicherry).

•  The drum performances performed by groups from Kerala, Rajahmundry and Maharashtra, and the Kerala drum performances filled the festival with new enthusiasm.

•  The art forms of the North-Eastern states like Galo dance from Arunachal Pradesh and Maroni dance from Sikkim stood as a special attraction.

 * Along with the Keelugurralu performance, the Ashtalakshmi Vaibhavam Bharatanatyam created a devotional ecstasy.

The cultural splendor displayed by these art groups from all over the country in the procession of Sri Malayappa Swamy during the Gaja Vahanam Seva reinforced the spiritual beauty and cultural unity during these Brahmotsavams.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

గజవాహనసేవలో కళా వైభవం 

తిరుమల, 2025 సెప్టెంబర్ 29: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం జరిగిన అత్యంత వైభవోపేతమైన గజవాహనం సేవకు దేశం నలుమూలల నుంచి విచ్చేసిన కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక శోభను తెచ్చిపెట్టాయి. 

ఈ రోజు వాహన సేవ రాజసానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తుంది, శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు అభయమిస్తూ రాజఠీవితో ఊరేగారు.

ఈ మహాద్భుత ఘట్టంలో మొత్తం 10 రాష్ట్రాల నుంచి 21 కళా బృందాలు పాల్గొన్నాయి. మొత్తం 463 మంది కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు.

కర్ణాటక నుంచి వచ్చిన కళాకారులు గజేంద్రవైభవం, బంజారా నృత్యం ప్రదర్శించారు. తిరుపతి నుండి వచ్చిన బృందాలు మయూరనృత్యం, కోలాటం, గజేంద్రమోక్షం వంటి సాంప్రదాయ నృత్యాలను కళ్ళకు కట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బృందం ప్రదర్శించిన ప్రసిద్ధ పేరిని నృత్యం అశేష భక్తజనాన్ని ఆకట్టుకుంది.

ఒడిస్సాకు చెందిన కళాకారుల ఒడిస్సీ నృత్య ప్రదర్శన శాస్త్రీయ కళా వైభవాన్ని చాటింది. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు ప్రత్యేకంగా కంసాలి రుచిత,  తమిళనాడు జానపదనృత్యం తో పాటు ఓయిలట్టం (పాండిచ్చేరి) ను ప్రదర్శించారు. 

కేరళ, రాజమండ్రి, మహారాష్ట్ర బృందాలు ప్రదర్శించిన డ్రమ్ము విన్యాసాలు సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.

అరుణాచల్ ప్రదేశ్ నుంచి గాలొ నృత్యం, సిక్కిం నుంచి మరోని నృత్యం వంటి ఈశాన్య రాష్ట్రాల కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

 కీలుగుర్రాలు ప్రదర్శనతో పాటు, అష్టలక్ష్మి వైభవం భరతనాట్యం భక్తి పారవశ్యాన్ని కలిగించింది.

గజవాహనం సేవ సందర్భంగా స్వామివారి ఊరేగింపులో దేశం నలుమూలల నుంచి వచ్చిన ఈ కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక వైభవం, ఈ బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభను, సాంస్కృతిక సమైక్యతను ఇనుమడింపజేసింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.