ASHTABANDHANA MAHASAMPROKSHAN BEGINS AT VIJAYAWADA SV TEMPLE _ విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
Tirupati, 27 July 2025: The Ashtabandhana Jeernodharana Mahasamprokshan programs began at Sri Venkateswara Swamy Temple in Vijayawada on Sunday.
As part of this, the Homagunda was lit in the Yagasala from 9 am to 12 noon and Punyahavachana, Panchagavyaradhana, Vastuhomam, Rakshabandhanam and Vedic programs were performed.
Kumbha Radhanas, Abhi Mantranam, Kalapakarshan and Yukta Homas will be performed in the Yagasala from 6.30 pm to 9 pm.
TTD officials and temple priests participated in this program.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
విజయవాడ / తిరుపతి, 2025 జూలై 27: విజయవాడ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంటల వరకు యాగశాలలో కుంభ రాధనలు, అభి మంత్రణము, కళాపకర్షణ, ఉక్త హోమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




