ASTA BANDHANA MAHA SAMPROKSHANA OF SRI LNS TEMPLE ON 1st GHAT ROAD _ ఏప్రిల్ 11 నుండి 15వ తేదీ వరకు మొద‌టి ఘాట్ రోడ్డులోని శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో అష్ట‌బంధ‌న మహాసంప్రోక్షణ

Tirumala, 08 April 2022: TTD is organising the Asta Bandhana Maha Samprokshana at Sri Lakshmi Narasimha Swami temple on first Ghat road from April 11-15 with Acharya Ruthwik Varanam and Ankurarpanam fetes on April 10.

Following are scheduled festivities:

Special Pujas on April 11 and 12

Asta Bandhanam on April 13

Maha Shanti Abhishekam, Purnahuti etc. on April 14

Maha Samprokshanam at 9.30 am on April 15.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 11 నుండి 15వ తేదీ వరకు మొద‌టి ఘాట్ రోడ్డులోని శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో అష్ట‌బంధ‌న మహాసంప్రోక్షణ

తిరుమల, 2022 ఏప్రిల్ 08: తిరుమ‌ల మొద‌టి ఘాట్ రోడ్డులోని శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 11 నుండి 15వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏప్రిల్ 10వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు ఆచార్య రుత్విక్ వ‌ర‌ణం, అంకురార్పణం జరుగనుంది.

ఇందులో భాగంగా ప్ర‌తి రోజు ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు విశేష హోమాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వ‌ర‌కు వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 9 గంట‌ల‌కు అష్ట‌బంధ‌నం, ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 4 గంట‌ల‌కు మ‌హాశాంతి అభిషేకం, పూర్ణాహూతి నిర్వ‌హిస్తారు.

ఏప్రిల్ 15వ తేదీ ఉద‌యం 9.30 గంట‌ల‌కు మ‌హా సంప్రొక్ష‌ణ నిర్వ‌హించ‌నున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.