ASTA LAKSHMI BALLET BY SVMC SHOW STOPPER OF THE EVENT _ గరుడ సేవలో భక్తులను మైమరపింపచేసిన అష్టలక్ష్మీ నృత్యరూపకం

Tirumala, 22 September 2023: The fifth day evening as part of ongoing annual brahmotsavams in Tirumala witnessed cultural diversity with different states performing their traditional arts with finesse in front of Garuda Vahana Seva.

The Panchavaidyam, Oriyadi, Kathakali, Mohiniattam from Kerala, Moillattam from Tamilnadu, Nashik Dolu from Maharashtra, Dasavatara Rupakam and Perni Nritya Rupakam by Telengana, Keeluguram from Chittoor of AP, Dandia from Rajasthan, Sarikeli Chahu from Jharkhand etc.added the cultural fervour. A total of 17 Teams with 422 artistes presented colourful performances which enthralled the devotees in galleries all along the four mada streets.

The highlight of the cultural event was the performance of Asta Lakshmi Vaibhavam by the students of TTD-run SV College of Music and Dance choreographed by the Principal Dr Uma Muddubala which won accolades from the devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

గరుడ సేవలో భక్తులను మైమరపింపచేసిన అష్టలక్ష్మీ నృత్యరూపకం

తిరుమల, 2023 సెప్టెంబరు 22: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు శుక్రవారం రాత్రి గరుడ వాహన సేవలో సాంస్కృతిక వైవిధ్యం కనిపించేలా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంప్రదాయ కళలను చక్కగా ప్రదర్శించారు. ఇందులో తిరుపతి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన అష్టలక్ష్మీ నృత్యరూపకం భక్తులను మైమరపింపచేసింది.

కేరళ నుండి పంచవాద్యం, ఒరియాడి, కథాకళి, మోహినియాట్టం, తమిళనాడు నుండి మొయిల్లాట్టం, మహారాష్ట్ర నుండి నాసిక్ డోలు, తెలంగాణ వారి దశావతార రూపకం, పేర్ణి నృత్య రూపకం, ఎపిలోని చిత్తూరు నుండి కీలుగుర్రాలు, రాజస్థాన్ నుండి దాండియా, జార్ఖండ్ నుండి సారికెళి చాహూ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మొత్తం 17 బృందాల్లో 422 మంది కళాకారులతో ప్రదర్శించిన కళారూపాలు గ్యాలరీలలోని భక్తులను ఆకట్టుకున్నాయి.

టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉమా ముద్దుబాల నృత్య దర్శకత్వం వహించి ప్రదర్శింపచేసిన అష్టలక్ష్మీ వైభవం భక్తుల మన్ననలు పొందింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.