ASTHANAM HELD IN SRI KRT _ శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
TIRUPATI, 10 April 2022: The temple city of Tirupati echoed with the chanting of “Rama Nama” on the festive day of Sri Rama Navami on Sunday and the temple court-“Asthanam” was performed with religious splendour in the shrine of Sri Kodanda Rama Swamy temple.
Later in the evening, unjal Seva followed by Hanumantha Vahanam was performed.
The entire temple has been decked up with floral pandals, decorations and light illuminations to make the occasion look great.
Spl Gr DyEO Smt Parvati and others were present.
SRI SITA RAMA KALYANAM ON APRIL 11
The celestial Kalyanam will be observed on April 11 between 6pm and 8pm while on April 12 Sri Rama Pattabhishekam will be performed.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
తిరుపతి, 2022 ఏప్రిల్ 10: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం 3 గంటలకు మూలవర్ల అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు నూతన వస్త్రాలను తీసుకొని విమానప్రదక్షిణగా వచ్చి స్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. ఆ తరువాత శ్రీరామ జన్మపురాణం, ఆస్థానం నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ అనంతరం ఉత్సవమూర్తులను వాహన మండపానికి వేంచేపు చేస్తారు. రాత్రి 8 గంటలకు శ్రీరామచంద్రమూర్తి తన ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 11న శ్రీ సీతారాముల కల్యాణం :
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరుగనుంది. ఇందుకోసం ఉదయం ఏనుగు మీద ముత్యాల తలంబ్రాల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపు టిటిడి పరిపాలన భవనం నుండి ప్రారంభమై తీర్థకట్ట వీధి, బజారు వీధి, గాంధీ రోడ్డు, నాలుగు మాడవీధుల గుండా ఆలయానికి చేరుకుంటుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు ( ఇద్దరు) కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఏప్రిల్ 12న ఉదయం ఉత్సవమూర్తులకు తిరుమంజనం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.