ASTOTTARA SATAKUNDATMAKAజూలై 23,24,25వ తేదీల్లో హైదరాబాదులో అష్టోత్తర శతకుండాత్మక మహావరుణజపము – టిటిడి ఈవో శ్రీకె.వి.రమణాచారి
జూలై 23,24,25వ తేదీల్లో హైదరాబాదులో అష్టోత్తర శతకుండాత్మక మహావరుణజపము – టిటిడి ఈవో శ్రీకె.వి.రమణాచారి
తిరుపతి, జూలై-21, 2008: చతుర్యుగబంధం – భక్తి చైతన్యయాత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణరథం తిరుగు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి అన్నారు. సోమవారం తితిదే పరిపాలనా భవనంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణరథం కృష్ణాజిల్లాలోని మువ్వక్షేత్రం నుండి ఆగస్టు 27వ తేదిన బయలుదేరి సెప్టెంబర్ 18వ తేది ఉదయం 10.00 గ||లకు తిరుపతికి చేరుకుంటుందని ఆయన చెప్పారు.
శ్రీకృష్ణరథం ప్రయాణించే ఆయాగ్రామాలలో, నగరాలలోని ప్రజలు స్వామివారిని దర్శించుకునేందుకు గాను ముందుగానే వారికి రథం వచ్చే తేదీలు, సమయం తెలిజేయాల్సిందిగా ఆయన సంబంధిత అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయాప్రాంతాలలో నున్న స్థానికుల సహకారాన్ని తీసుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జూలై 23,24,25వ తేదిలందు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో హైదరాబాదు నందు గల ఎగ్జిబిషన్ గ్రౌండ్సునందు అష్టోత్తర శతకుండాత్మక మహావరుణజపము నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతిరోజు శ్రీనివాసునికి ఉదయం స్నపనతిరుమంజనం, విశేష వరుణసూక్త మంత్రజపం, హోమం, వేదాపారాయణ వైఖానసాగమోక్తంగా జరుగుతుందని ఆయన తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.