ASTOTTARA SATHAKUNDATHMAKA MAHA SANTHI YAGAM FROM JAN 29 TO 31_ జనవరి 29 నుండి 31వ తేదీ వరకు శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తరశతకుండాత్మక మహాశాంతియాగం
జనవరి 29 నుండి 31వ తేదీ వరకు శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తరశతకుండాత్మక మహాశాంతియాగం
తిరుపతి, 2010 జనవరి 28: ఈనెల 29,30,31వ తేదీలలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఈ క్రింది తెల్పిన కార్యక్రమాలు నిర్వహింపబడుతాయి.
జనవరి 29వ తేది: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉదయం 8 గంటలకు విష్వక్సేనులవారికి పూజా కార్యక్రమంతో మూడు రోజులపాటు జరుగనున్న అష్టోత్తరశతకుండాత్మక అద్భుత మహాశాంతియాగం ప్రారంభం.
జనవరి 30వ తేది: సాయంత్రం 7.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం ముందున్న నాదనీరాజనం వేదికవద్ద 22ర్ గారిచే అన్నమయ్య సంస్కృత కీర్తనాలాపనం, సిడీల సమర్పణ.
జనవరి 31వ తేది: ఉదయం 7.30 గంటలకు రాష్ట్రదేవాదాయశాఖామాత్యులు శ్రీ గాదె వేంకటరెడ్డి గారిచే తిరుమలలో ఫోటోమెట్రిక్ కౌంటర్ (రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో), శ్రీవారి లడ్డు ప్రసాద బూంది తయారీ కేంద్రాన్ని (శ్రీవారి ఆలయం ప్రక్కన) ప్రారంభం.
ఉదయం 8.30 గంటలకు: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ కొణిజేటి రోశయ్యగారు తిరుమలలో కల్యాణవేదికకు శంఖుస్థాపన చేస్తారు.
ఉదయం 9.30 గంటలకు: శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం. ఈ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌గారు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిజేటి రోశయ్యగారు, మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీరామేశ్వర్ ఠాగూర్ గారు, దేవాదాయ శాఖామాత్యులు శ్రీ గాదె వెంకటరెడ్టిగారు ఇతరులు పాల్గొంటారు.
ఉదయం 11.30 గంటలకు: అష్టోత్తర శతకుండాత్మక అద్భుత మహాశాంతియాగం పూర్ణాహుతి. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, దేవదాయశాఖామాత్యులు, ఇతర మంత్రులు, పెద్దలు పాల్గొంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.