ASWA VAHANA SEVA HELD _ అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

Tirupati, 13 June 2025: The last among the Vahana Sevas, Aswa Vahana Seva was held in Appalayagunta on Saturday evening.

Sri Prasanna Venkateswara as Kalki atop the divine horse carrier took out a celestial ride along the four mada streets to bless His devotees.

On Sunday, the nine day annual brahmotsavams concludes with Dhwajavarohanam in the evening while Chakra Snanam will be observed in the morning.

DyEO Sri Harindranath and others were present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

తిరుపతి/ అప్పలాయగుంట, 2025, జూన్ 14: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు.

సా. 5.30 – 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. రాత్రి 07.00 – 08.00 గం.ల మధ్య అశ్వవాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.

జూన్ 15న చక్రస్నానం, ధ్వజావరోహణం :

జూన్ 15 ఆదివారం ఉదయం 08.00- 9.00 గం.ల మధ్య పల్లకీ ఉత్సవం జరుగనుంది. తదుపరి 9.15 – 10.30 గం.ల వరకు స్నపన తిరుమంజనం చేపడుతారు. అనంతరం ఉదయం 10.30 – 10.45 గం.ల వరకు తీర్థవారి చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00- 5.00 గం.ల మధ్య శ్రీవారి మాడవీధి ఉత్సవం జరుగుతుంది. రాత్రి 07.00 – 07.30 గం.ల మధ్య ధ్వజావరోహణతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.