ASWA VAHANA SEVA HELD _ అశ్వవాహనంపై మహారాణి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

TIRUPATI, 05 DECEMBER 2024: On the last day of Vahana Seva Sri Padmavati Devi in all Her grace and elegance appeared on the last among carriers, the Aswa Vahana seva on Thursday night.

The Goddess appeared as Maharani, on the divine Horse carrier and blessed Her devotees along four mada streets.

Tirumala Sri Pedda Jeeyar Swamy, Chairman Sri BR Naidu, EO Sri J Syamala Rao, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అశ్వవాహనంపై మహారాణి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుప‌తి, 2024 డిసెంబ‌రు 05: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం రాత్రి అమ్మవారు మహారాణీ అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు.

రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలను తొలగిపోతాయని విశ్వాసం.

వాహనసేవల్లో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది