AUTONOMOUS STATUS GRANTED TO SV ARTS COLLEGE _ ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు అటానమస్ హోదా

UGC GIVES TEN YEARS STATUS

TTD CHAIRMAN AND EO COMPLIMENT OFFICIALS & FACULTY

Tirupati, 09 December 2023:The UGC has granted 10 years autonomous status to the TTD run one of most prestigious and seven and a half decades old  SV Arts College enabling it an opportunity for independent decisions towards the development of the institution with regard to the method of teaching, conducting exam, syllabus change to tackle global challenges etc.

TTD Chairman Sri Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy complimented the JEO for Health and Education Smt Sada Bhargavi, DEO Sri Bhaskar Reddy, Principal Smt Narayanamma, faculty and students on their achievement.

Among others social approach in teaching, advanced techniques of course, best memory methods and campus selection promotion. 

The college commenced in 1945  by the then TTD board  Chairman Diwan Sri Raghunath Reddy for the education of the poor in Rayalaseema districts with just 80 students and has at present 2735 students. 

It got NAAC recognition on 2022 September 13.

It is ranked in the quality management system ( ISO 9001:2015) environmental management system etc and bagged ISO ranks. 

The college has an Army wing, Air wing, R and V Regiment, two NSS units, one special placement cell, a competitive exams cell, active academic council, science club along with Ambedkar Regional Study Center and Indira Gandhi National Open University Study Center.

Recently Chief Minister of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy launched the first block.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు అటానమస్ హోదా

– పదేళ్లపాటు హోదా కల్పించిన యుజిసి

– అధికారులు, అధ్యాపక బృందాన్ని అభినందించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుపతి, 2023 డిసెంబరు 09: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 10 సంవత్సరాల పాటు అటానమస్(స్వయంప్రతిపత్తి) హోదా మంజూరు చేసింది. తద్వారా కళాశాల అభివృద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. విద్యావిధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్ లో మార్పులు చేసుకోవడానికి వీలవుతుంది. దీంతోపాటు సామాజిక సేవా దృక్పథంతో విద్యా బోధన, ఆధునిక సాంకేతికత ఆధారంగా కోర్సుల నిర్వహణ, మెమరీ బేస్డ్ విద్యావిధానం ఏర్పాటుకు వెసులుబాటు కలుగుతుంది. ప్రాంగణ ఎంపికలకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తాయి.

1945లో కళాశాల ఏర్పాటు

రాయలసీమ జిల్లాలకు చెందిన నిరుపేద పిల్లల విద్యా అవసరాలను తీర్చడానికి తిరుపతిలో కళాశాల ఏర్పాటు చేయాలని అప్పటి టీటీడీ బోర్డు ఛైర్మన్ దివాన్‌ బహద్దూర్ శ్రీ వి.రఘునాథరెడ్డి 1943 ఆగస్టులో ప్రతిపాదించారు. ఈ మేరకు 1945లో 80 మంది విద్యార్థులతో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రారంభమైంది. ప్రస్తుతం 2,735 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2022 సెప్టెంబర్ 13న కళాశాల న్యాక్ ఎ ప్లస్ గుర్తింపు పొందింది. క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ISO 9001:2015), ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ISO 14001:2015), ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ISO 50001:2011)తో సహా వివిధ రంగాలలో కళాశాల ఐఎస్వో ధృవీకరణ పొందింది.

కళాశాలలో ఆర్మీ వింగ్, ఎయిర్ వింగ్, R&V రెజిమెంట్, రెండు ఎన్ఎస్ఎస్ యూనిట్లు, ఒక ప్రత్యేక ప్లేస్‌మెంట్ సెల్, పోటీ పరీక్షల సెల్, యాక్టివ్ అకడమిక్ కౌన్సిల్, సైన్స్ క్లబ్, ఎన్సిసి వింగ్‌ ఉన్నాయి. అంబేద్కర్ రీజినల్ స్టడీ సెంటర్, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ స్టడీ సెంటర్ ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి హాస్టల్ బ్లాక్ ను ప్రారంభించారు.

ఛైర్మన్, ఈవో అభినందన

టీటీడీకి చెందిన ఎస్వీ ఆర్ట్స్కళాశాలకు అటానమస్ హోదా  లభించడానికి కృషి చేసిన టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, విద్యాశాఖాధికారి డాక్టర్ ఎం.భాస్కర్ రెడ్డి,కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.నారాయణమ్మ, కళాశాల అధ్యాపక బృందాన్ని టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.