AWARENESS PROGRAMME ON SAFETY STANDARDS IN ELECTICAL POWER SYSTEMS FOR TTD STAFF HELD _ విద్యుత్ సరఫరా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలపై టీటీడీ సిబ్బందికి అవగాహనా కార్యక్రమం

Tirumala, 16 April 2026: An awareness programme on safety standards in electrical power systems and fire awareness was organized for the staff of the TTD Electrical Department on Thursday at the SV Museum Auditorium in Tirumala.

On this occasion, former CMD of APSPDCL, Sri J. Padma Janardhan Reddy, provided awareness to the staff on several technical aspects, including electrical installations, maintenance practices, and preventive safety measures.

Subsequently, TTD ADFO Sri P. Anil Kumar conducted an awareness session on fire accident prevention.

TTD DE Sri Chandra Sekhar, Deputy Executive Engineer Smt. Vani and other officials participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

విద్యుత్ సరఫరా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలపై టీటీడీ సిబ్బందికి అవగాహనా కార్యక్రమం

తిరుమల, 2026 ఏప్రిల్ 16: విద్యుత్ సరఫరా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు మరియు అగ్ని ప్రమాదాల నివారణపై టీటీడీ విద్యుత్ విభాగం సిబ్బందికి గురువారం తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ శ్రీ జె.పద్మ జనార్ధన్ రెడ్డి సిబ్బందికి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, ముందస్తు జాగ్రత్త చర్యలు వంటి పలు టెక్నికల్ అంశాలపై అవగాహన కల్పించారు.

అనంతరం టీటీడీ ఏడీఎఫ్ఓ శ్రీ పి.అనిల్ కుమార్ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ డీఈ శ్రీ చంద్ర శేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీమతి వాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.