AYANA MAHAL (MIRROR MANDAPAM ) OPENED AT SRI GOVINDARAJA SWAMI TEMPLE _ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఐనా మ‌హ‌ల్ ప్రారంభం

Tirupati, 22 August 2021: TTD Executive Officer Dr. KS Jawahar Reddy inaugurated the Mirror Mandapam refurbished at a cost of Rs.66 lakhs at the Sri Govindaraja Swami Temple on Sunday evening.

After traditional pujas at the Aiyana Mahal unjal Seva festivities were performed for utsava idols of Sri Devi, Bhudevi sametha Sri Govindarajaswami, and Sri Pundarika Valli Ammavaru.

DAILY UNJAL SEVA AT AYANA MAHAL

Speaking on the occasion the TTD EO said henceforth the unjal Seva shall be performed daily at the Ayana Mahal in the Sri Govindaraja Swami temple. 

He said the modernized 20-year-old Ayana Mahal was relaunched for devotee’s service on the auspicious day of Shravana Pournami.

Tirumala pontiff HH Sri  Pedda Jeeyar Swamy, JEO Smt Sada Bhargavi, FA&CAO Sri Balaji, Special Grade DyEO Sri Rajendrudu, DyEOs Sri Govindarajulu, Sri Ramana Prasad, Chief Archaka Sri Srinivasa Deekshitulu, AEO Sri Ravikumar Reddy, Superintendent Sri Venkatadri and Temple Inspector Sri Kamraj were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఐనా మ‌హ‌ల్ ప్రారంభం

తిరుప‌తి, 2021 ఆగ‌స్టు 22: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో రూ. 66 లక్షలతో ఆధునీక‌రించిన ఐనా మ‌హ‌ల్‌ను ఆదివారం రాత్రి టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రారంభించారు.

శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఐనా మహల్ లో సాయంత్రం 6.30 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, పుండరీక వల్లి అమ్మవారి ఉత్స‌వ‌ర్ల‌కు ఊంజ‌ల్ సేవ నిర్వ‌హించారు. ఐనా మహల్ ను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఏసిఎ వో శ్రీ బాలాజి, ఎస్ఈ ఎలక్ట్రికల్ శ్రీ వెంకటేశ్వర్లు, ఆల‌య ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో  శ్రీ రాజేంద్రుడు, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజులు, శ్రీ రమణ ప్రసాద్, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.శ్రీ‌నివాస దీక్షితులు, ఏఈవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

ఐనా మహల్ లో ఇక రోజూ ఊంజల్ సేవ : ఈవో

గోవింద రాజాస్వామి ఆలయంలో ఆధునీకరించిన ఐనా మహల్ ను శ్రావణ పౌర్ణమి పుణ్యదినం సందర్భంగా పునఃప్రారంభించామని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, 20 ఏళ్ళ కిందట నిర్మించిన ఐనా మహల్ ను ఆధునీకరించి పునః ప్రారంభించామన్నారు. ఇక మీదట ఇక్కడ రోజూ స్వామివారి ఊంజల్ సేవ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.