AYUDHA PUJA HELD _ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఘనంగా ఆయుధపూజ

Tirumala, 15 November 2024: Ayudha Puja was held in a grand manner at  Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Complex in Tirumala on Friday. 

TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary participated in this program.

First, special pujas were performed to the pictures of Sri Padmavati and Sri Venkateswara amidst the chanting of Vedic mantras and later the machines and utensils used for the preparation of Anna Prasadam were worshipped. 

Afterwards, the Additional EO felicitated the Annadanam staff.

Deputy EOs Sri Rajendra, Smt. Asha Jyothi, Catering Special Officer Sri Sastry, other office staff, catering staff and Srivari Sevaks participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఘనంగా ఆయుధపూజ

తిరుమల, 2024 నవంబరు 15: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో శుక్రవారం ఆయుధ పూజ ఘనంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ‌ వేంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదాల త‌యారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని అడిషనల్ ఈవో సన్మానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీమతి ఆశాజ్యోతి, క్యాటరింగ్ ప్ర‌త్యేకాధికారి శ్రీ శాస్త్రి, ఇతర కార్యాలయ సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.