AYUDHA PUJA HELD _ తిరుమల రవాణా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధపూజ
Tirumala, 26 October 2024: Ayudha puja was observed in a grand manner by the TTD Transport Department, Tirumala division on Saturday evening in a grand manner at the local workshop.
TTD Additional EO Sri. Ch Venkaiah Chowdary graced the event and performed a special puja.
On this occasion, the vehicles in Tirumala were traditionally decorated with flowers and banana arches.
Prasadams were distributed after worshipping the idol of Sri Venkateswara Swamy.
Transport GM Sri. Sesha Reddy, Deputy EO (R-1) Sri. Bhaskar, VGO Sri. Surendra, other officers and staff participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల రవాణా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధపూజ
తిరుమల, 2024 అక్టోబరు 26: టీటీడీ రవాణా శాఖ తిరుమల విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ శనివారం స్థానిక వర్క్‌షాపులో ఘనంగా జరిగింది. టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుమలలోని వివిధ టీటీడీ వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు.
రవాణా విభాగం జీఎం శ్రీ శేషారెడ్డి, డిప్యూటీ ఈవో (ఆర్-1) శ్రీ భాస్కర్, వీజీఓ శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.