AYUDHA PUJA IN TTD PRESS _ టీటీడీ ముద్రణాలయంలో ఘనంగా ఆయుధ పూజ
TIRUPATI, 04 NOVEMBER 2023: Ayudha Puja was held in TTD Printing Press on Saturday in Tirupati.
TTD EO Sri AV Dharma Reddy participated in the special Puja held on the occasion and offered prayers to Srivari statue.
Later he also performed puja to the printing, DTP, Binding, machinery and also commenced the new Binding Machine commissioned in the press at Rs.16lakhs.
JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, DLO Sri Veeraju, VGO Sri Bali Reddy, Special Officer Publications Sri Ramaraju, other staff were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
టీటీడీ ముద్రణాలయంలో ఘనంగా ఆయుధ పూజ
తిరుపతి, 2023 నవంబరు 04: తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా గల ముద్రణాలయంలో శనివారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా శ్రీవారి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముద్రణాలయాన్ని అందంగా అలంకరించి అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ గల డిటిపి, ఆఫ్‌సెట్, మిషన్ సెక్షన్, ఆర్టిస్టు, బైండింగ్ విభాగాల్లోని యంత్రాలకు ఆయుధపూజ చేశారు.
అనంతరం రూ.16 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫర్పెక్ట్ బైడింగ్ మిషన్‌కు ఈవో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.
జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, డిఎల్‌వో శ్రీ వీర్రాజు, ముద్రణాలయం ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు, విజివో శ్రీ బాలిరెడ్డి, అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.