AYUR HAS REMIDIES FOR ALL DISEASES _ శ్వేత‌లో క‌రోనాపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం‌

Tirupati, 5 Nov. 20: Renowned scholar Dr Mylavarapu Srinivasa Rao on Thursday advocated that the ancient Indian medicine, Ayurveda has remedies for all ailments including dreadful viral diseases.

During the on line awareness program on Covid held to TTD employees in SVETA bhavan at Tirupati, he said, there is mention about corona and other viral diseases in Vedas. Amla, lemon and turmeric are best used to overcome chronic and viral diseases.

He asserted usage of these ingredients in our daily food routine will develop immunity and antibodies within our body to combat dreadful viruses.

SVETA Director Sri Ramanjulu Reddy was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్వేత‌లో క‌రోనాపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం‌

తిరుప‌తి, 2020 న‌వంబ‌రు 05: తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో గురువారం వేద‌కాలం-క‌రోనా లాంటి వ్యాధులు-చికిత్స అనే అంశంపై ప్ర‌ముఖ పండితులు డా. మైల‌వ‌ర‌పు శ్రీ‌నివాస‌రావు టిటిడి ఉద్యోగుల‌కు ఆన్‌లైన్ ద్వారా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా డా. మైల‌వ‌ర‌పు శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ వేద‌కాలంలోనే క‌రోనా లాంటి వ్యాధుల ప్ర‌స్తావ‌న ఉంద‌ని, ఆయుర్వేద వైద్య‌గురువు శుశ్రుతుడు ఇలాంటి వ్యాధుల‌కు చికిత్సా ప‌ద్ధతుల‌ను తెలియ‌జేశార‌ని తెలిపారు. ఉసిరి, నిమ్మ‌, ప‌సుపు వినియోగం ద్వారా రోగ నిరోధ‌కశ‌క్తి పెరిగి ఇలాంటి వ్యాధుల‌ను ఎదుర్కోవ‌చ్చ‌న్నారు. ఇలాంటి వ్యాధులు వ్యాప్తి చెందే విధానం, తీసుకోవాల్సిన  జాగ్ర‌త్త‌లను మ‌న పూర్వీకులు అధ‌ర్వ‌ణ వేదంలో చెప్పార‌ని వివ‌రించారు. అనంత‌రం ఉద్యోగులు అడిగిన ప‌లు సందేహాల‌ను నివృత్తి చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్వేత సంచాల‌కులు డా.కె.రామాంజుల‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.