AYURVEDA- AROGYA CAMPAIGN BY SV AYURVEDA COLLEGE _ ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేదం – ఆరోగ్యంపై ప్రచారం
Tirupati 10 Dec. 21:As a part of Azadi ka Amruta Mahotsav, a clarion call was given by the Ministry of Ayush in connection with the 75th Anniversary Celebrations of Indian Independence, the TTD-run SV Ayurveda College has organised the Ayurveda-Arogya awareness campaign in Tirupati on Friday.
The awareness campaign is being organized in all colleges and schools at Tirupati and as a part of it carried out in Bharathiya Vidya Bhavan on Friday.
Dr Sundaram, Principal of the SV Ayurveda College presided over the program in which Prof S Jnanprasuna and Asst Professor Dr B Bhaskar Rao highlighted the significance of food in Health.
Director of Bharathiya Vidya Bhavan Sri Satyanarayana Raju, vice-principal Smt Sundari, 450 students from Bhavans schools, teachers and staff were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేదం – ఆరోగ్యంపై ప్రచారం
తిరుపతి, 2021 డిసెంబర్ 10: భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేదం – ఆరోగ్యంపై వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎస్వీ ఆయుర్వేద కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆహారం, ఆరోగ్యం దాని ప్రాముఖ్యత అనే అంశంపై ఆయుర్వేద కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.జ్ఞానప్రసూన, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.భాస్కర్ రావు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ రాజు, వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి సుందరి, 450 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.