BACKWARD AREAS DEVOTEES EXPRESS IMMENSE HAPPINESS OVER VAIKUNTHADWARA-DARSHAN OF SRIVARU-TTD ADDITIONAL EO _ సమాజంలో భక్తి తత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి – టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirumala, 18 Jan. 22: The devotees who hailed from SC, ST and fishermen communities expressed their immense happiness for having the “Vaikunthadwara Darshanam” of Sri Venkateswara Swamy for the first time in their lives, said TTD Additional EO Sri AV Dharma Reddy.
Addressing the devotees who arrived from the backward areas of Addateegala, Rampachodavaram etc. in East Godavari district at Madhava Nilayam (PAC 2) in Tirumala on Tuesday evening, the Additional EO said, Srivari Brahmotsava Darshanam was provided to these people during last year where in each day 1000 members had darshan. Similarly, Vaikunthadwara darshanam is also being provided to the devotees hailing from the SC, ST and Fishermen colonies wherein TTD along with Samarasata Seva Foundation constructed 502 temples in these backward areas as a part of Hindu Dharma Prachara activity of TTD. “We have given to a few hailing from these communities, special training in Archakatva also. The mission behind this programme is to ensure that there will not be any religious conversions from backward areas”, he maintained.
Deputy EOs Sri Harindranath, Sri Bhaskar, Samarasata Seva Foundation representatives Sri Jaganmohan Reddy, Sri Syamprasad, Smt Indira Devi, Sri Sudhakar and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సమాజంలో భక్తి తత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి – టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల వెంకన్న దర్శనంతో జన్మధన్యం
– శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంపై భక్తుల స్పందన
తిరుమల, 2022 జనవరి 18: సమాజంలో భక్తి తత్వాన్ని పెంపొందించేందుకు సనాతన హైందవ ధర్మాన్నివ్యాప్తి చేయలని, ఇందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు తిరుమలలోని మాధవ నిలయం(పీఏసీ 2)లో బస చేశారు.
మంగళవారం సాయంత్రం తిరుమలలోని మాధవ నిలయంలో తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల, రంపచోడవరం తదితర వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులనుద్దేశించి అదనపు ఈవో మాట్లాడుతూ గత ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎజెన్సీ ప్రాంతాల్లోని భక్తులకు స్వామివారి దర్శనం కల్పించినట్లు తెలిపారు. ప్రతిరోజు 1000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారన్నారు. జీవితంలో తొలిసారిగా శ్రీవేంకటేశ్వర స్వామివారి వైకుంఠద్వార దర్శనం పొందినందుకు ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార వర్గాలకు చెందిన భక్తులు ఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేశారని టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
అదేవిధంగా టిటిడి హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా 502 దేవాలయాలను సమరసత సేవా ఫౌండేషన్‌తో కలిసి టిటిడి నిర్మించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార కాలనీల నుండి వచ్చిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామన్నారు. “ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార వర్గాల నుండి వచ్చిన వారికి అర్చకత్వంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో ఎటువంటి మత మార్పిడులు జరగకుండా చూడటమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న లక్ష్యం” అని ఆయన వివరించారు.
తూర్పు గోదావరి లాంటి సుదూర ఏజెన్సీ ప్రాంతాల నుండి సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా బస్సుల ద్వారా తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారి దర్శనం కల్పించడంపై ఆయా ప్రాంతాల భక్తులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఏజెన్సీ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు మాట్లాడుతూ జీవితంలో మొదటిసారి శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దారి పొడవున మంచి భోజనాలు, వసతి కల్పించారన్నారు. అదేవిధంగా తిరుమలలో కూడా చక్కటి దర్శనం, వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసిన టిటిడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన టిటిడి రుణం ఎప్పటికి తీర్చుకొలేమని, జీవితంలో ఒకసారైన శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ భాస్కర్, సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీ జగన్మోహన్ రెడ్డి, శ్రీ శ్యాంప్రసాద్, శ్రీమతి ఇందిరాదేవి, శ్రీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.