BADRI NARAYANA ON CHINNA SESHA _ చిన్నశేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి
TIRUMALA, 28 SEPTEMBER 2022: On the second day morning, Sri Malayappa takes as Badrinarayana takes ride on celestial Chinna Sesha Vahanam to bless devotees.
HH Sri Pedda Jeeyar of Tirumala along with HH Sri Chinna Jeeyar of Tirumala, Chairman Subba Reddy, EO Sri Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, DyEO Sri Ramesh Babu and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చిన్నశేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి
తిరుమల, 2022 సెప్టెంబరు 28: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు బుధవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.
చిన్నశేష వాహనం – కుటుంబ శ్రేయస్సు
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.