BAKASURA VADHA ALANKARAM ON MUTYAPU PANDIRI _ ముత్యపు పందిరి వాహనంపై బకాసురవధ అలంకారంలో శ్రీ మలయప్ప
TIRUMALA, 17 OCTOBER 2023: Sri Malayappa flanked by Sridevi and Bhudevi took a celestial ride along four mada streets on Mutyapu Pandiri Vahanam.
The processional deity donned ‘Bakasura Vadha’ Alankaram and blessed His devotees.
TTD Chairman Sri B Karunakara Reddy, EO Sri AV Dharma Reddy and others were present.
ముత్యపు పందిరి వాహనంపై బకాసురవధ అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల, 2023 అక్టోబరు 17: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బకాసురవధ అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు.
సకల సౌభాగ్య సిద్ధి
ముత్యాలు నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిని, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.
వాహనసేవలలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.