BALALAYAM AT NAGULAPURAM TEMPLE FROM DECEMBER 3-7 _ డిసెంబరు 2 నుండి 7వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో బాలాలయం
Tirupati,24 November 2023: TTD is organizing Balalayam at Sri Veda Narayana Swamy temple in Nagulapuram from December 3-7 with Ankurarpanam on December 2 evening.
As part of the Balalayam, a model sanctum is built with portraits of main idols to facilitate daily pujas and repairs will be taken.
In connection with the auspicious fete, TTD is observing several rituals daily for five days from December 3 onwards at the Yagashala of the temple.
On the last day on December 7 Purnahuti, Kumbha Pradakshina, Divya Prabandha Sattumora will be performed and Balalaya Samprokshana will be held on Makara Lagnam between 9.20 am and 10.10 am.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
డిసెంబరు 2 నుండి 7వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో బాలాలయం
తిరుపతి, 2023 నవంబరు 24 ; నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో డిసెంబరు 2 నుండి 7వ తేదీ వరకు ”బాలాలయం” కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఇందుకోసం డిసెంబరు 2న ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం 6 గంటల నుండి మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, వాస్తు హోమం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేస్తారు.
ఇందులో భాగంగా డిసెంబరు 3న ఉదయం అకల్మష హోమం, రక్షాబంధనం, సాయంత్రం కుంభస్థాపన, కళాకర్షణ, అగ్నిప్రతిష్ట, కుంభాలను యాగశాలకు తీసుకొచ్చి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
డిసెంబరు 4న ఉదయం బాల బింబములకు, చిత్రములకు అక్షమోచనం, నవకలశ స్నపనం, పంచగవ్యాధివాసం, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.
డిసెంబరు 5న ఉదయం క్షీరాధివాసం, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
డిసెంబరు 6న ఉదయం జలాధివాసం, మహాశాంతి అభిషేకం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, శయనాధివాసం, హోత్రం, విశేష హోమం చేపడతారు.
డిసెంబరు 7న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షణ దివ్యప్రబంధ శాత్తుమొర నిర్వహిస్తారు. ఉదయం 9.20 నుండి 10.10 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ సంప్రోక్షణం చేపడతారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.