BALALAYAM IN KALIGI SRI VENKATESWARA SWAMY TEMPLE _ నవంబరు 8 నుండి 10వ తేదీ వరకు కలిగిరి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బాలాలయం
TIRUPATI, 05 NOVEMBER 2021: Sridevi Bhudevi Sametha Sri Kalyana Venkateswara Swamy temple in Kaligiri mountain of Penumuru Mandal in Chittoor district is gearing up for Balalayam from November 8 to 10.
Ankurarpanam will be observed on November 8 followed by Yagashala activities on November 9 and 10 including Balalaya Maha Samprokshanam.
Srinivasa Mangapuram group of temples DyEO Smt Shanti is supervising the arrangements for the religious event.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 8 నుండి 10వ తేదీ వరకు కలిగిరి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బాలాలయం
తిరుపతి, 05 నవంబరు 2021: పెనుమూరు మండలంలోని కలిగిరికొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 8 నుండి 10వ తేదీ వరకు బాలాలయ కార్యక్రమాలు జరుగనున్నాయి.
నవంబరు 8న ఉదయం 9.30 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం 6.30 గంటలకు అంకురార్పణ, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నవంబరు 9న ఉదయం, సాయంత్రం వేళల్లో యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు. నవంబరు 10న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలతో ప్రారంభించి ఉదయం 9.30 గంటలకు పూర్ణాహుతి, ఉదయం 10.20 నుండి 10.40 గంటల మధ్య ఆవాహన ప్రోక్షణ(బాలాలయం), ఆచార్య బహుమానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీనివాసమంగాపురం గ్రూపు ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి విఆర్.శాంతి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.